NTV Telugu Site icon

April Born Kids Traits: ఏప్రిల్‌లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

April Born

April Born

April Born Kids Traits: ఒక్కో నెలలో పుట్టిన వారి పద్ధతి ఒక్కోలా ఉంటుందని పాశ్చాత్య జ్యోతిష్యులు చెబుతున్నారు. వారి జీవన విధానం, వ్యక్తిత్వం, అలవాట్లు అన్నీ భిన్నంగా ఉంటాయంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఏప్రినెలలో జన్మించిన వారి గురించి వారు చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం..

ఏప్రిల్ నెలలో జన్మించిన వారు పనుల పట్ల ఏకాగ్రత, శ్రద్ధ కలిగి ఉంటారు. మాటలు తక్కువ చేతలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ ఉత్సాహంగా, చురుగ్గా మెలుగుతారు. ఎప్పుడూ కొత్త దనాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారు. విశ్రాంతి కంటే ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానిడి తపను పడుతుంటారు.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి భావోద్వేగాలు ఎక్కువ. సున్నితమైన మనసు. బయటకి మొండిగా కనిపిస్తారు. కఠినంగా మాట్లాడుతున్నా నిజానికి వారి మనసు చాలా సున్నితం. చాలా చిన్న విషయాలకే బాధ పడుతుంటారు. హృదయం చెప్పిన మాటాలను వింటుంటారు. ఈనెలలో జన్మించిన వారిని ఎవ్వరైనా సులువుగా నమ్మవచ్చు. ఎందుకంటే వీరు వ్యక్తుల పట్ల విశ్వసాన్ని కలిగి ఉంటారు. స్నేహానికి, బంధుత్వాలకు ప్రాధాన్యత నిస్తారు.

మిగతా నెలల్లో పుట్టిన వారితో పోలిస్తే ఏప్రిల్‌లో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరికి నాయకులయ్యే లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టీమ్‌ను ఎలా ముందుకు నడిపించాలో వారికి బాగా తెలుసు. అంతేకాదు తమ పక్కనన్న మిత్రులను వెంటనే నమ్ముతారు. తనను కాపాడే వారు తన పక్కనున్న వారే నని విశ్వసిస్తారు. మంచి మార్గంలో నడిపించే శక్తి తమ పక్కన ఉన్నవారికి ఉందని భావిస్తూ ఉంటారు.

వీరికి జాలి, దయ ఎక్కువ. మనుషులతో చాలా దయగా ప్రవర్తిస్తారు. ఎదుటివారు చెప్పే బాధలు వింటూ ఉంటారు. వారిని ఓదార్చేందుకు ముందుంటారు. ఓ రకంగా ఈ నెలలో జన్మించిన వారు మంచి వారని చెప్పవచ్చు. ఏప్రిల్ అనే పదం లాటిన్ పదమైనా ఎపేరిరే అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. అంటే అర్థం ‘తెరవడం’ అని. అంటే కొత్త కాలానికి, కొత్త సమయానికి ద్వారం తెరుచుకునే కాలం అని. అందుకే ఏప్రిల్ నెలలోనే వసంతం వికసిస్తుంది. ప్రకృతి కొత్త చిగుళ్ళు వేస్తుంది. ఏప్రిల్ నెలలోనే ఎక్కువగా ఉగాది పండుగ కూడా వస్తూ ఉంటుంది.