April Born Kids Traits: ఏప్రిల్‌లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
April Born Kids Traits: ఒక్కో నెలలో పుట్టిన వారి పద్ధతి ఒక్కోలా ఉంటుందని పాశ్చాత్య జ్యోతిష్యులు చెబుతున్నారు. వారి జీవన విధానం, వ్యక్తిత్వం, అలవాట్లు అన్నీ భిన్నంగా ఉంటాయంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఏప్రినెలలో జన్మించిన వారి గురించి వారు చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం..
ఏప్రిల్ నెలలో జన్మించిన వారు పనుల పట్ల ఏకాగ్రత, శ్రద్ధ కలిగి ఉంటారు. మాటలు తక్కువ చేతలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ ఉత్సాహంగా, చురుగ్గా మెలుగుతారు. ఎప్పుడూ కొత్త దనాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారు. విశ్రాంతి కంటే ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానిడి తపను పడుతుంటారు.
Also Read
ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి భావోద్వేగాలు ఎక్కువ. సున్నితమైన మనసు. బయటకి మొండిగా కనిపిస్తారు. కఠినంగా మాట్లాడుతున్నా నిజానికి వారి మనసు చాలా సున్నితం. చాలా చిన్న విషయాలకే బాధ పడుతుంటారు. హృదయం చెప్పిన మాటాలను వింటుంటారు. ఈనెలలో జన్మించిన వారిని ఎవ్వరైనా సులువుగా నమ్మవచ్చు. ఎందుకంటే వీరు వ్యక్తుల పట్ల విశ్వసాన్ని కలిగి ఉంటారు. స్నేహానికి, బంధుత్వాలకు ప్రాధాన్యత నిస్తారు.
మిగతా నెలల్లో పుట్టిన వారితో పోలిస్తే ఏప్రిల్‌లో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరికి నాయకులయ్యే లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టీమ్‌ను ఎలా ముందుకు నడిపించాలో వారికి బాగా తెలుసు. అంతేకాదు తమ పక్కనన్న మిత్రులను వెంటనే నమ్ముతారు. తనను కాపాడే వారు తన పక్కనున్న వారే నని విశ్వసిస్తారు. మంచి మార్గంలో నడిపించే శక్తి తమ పక్కన ఉన్నవారికి ఉందని భావిస్తూ ఉంటారు.
వీరికి జాలి, దయ ఎక్కువ. మనుషులతో చాలా దయగా ప్రవర్తిస్తారు. ఎదుటివారు చెప్పే బాధలు వింటూ ఉంటారు. వారిని ఓదార్చేందుకు ముందుంటారు. ఓ రకంగా ఈ నెలలో జన్మించిన వారు మంచి వారని చెప్పవచ్చు. ఏప్రిల్ అనే పదం లాటిన్ పదమైనా ఎపేరిరే అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. అంటే అర్థం ‘తెరవడం’ అని. అంటే కొత్త కాలానికి, కొత్త సమయానికి ద్వారం తెరుచుకునే కాలం అని. అందుకే ఏప్రిల్ నెలలోనే వసంతం వికసిస్తుంది. ప్రకృతి కొత్త చిగుళ్ళు వేస్తుంది. ఏప్రిల్ నెలలోనే ఎక్కువగా ఉగాది పండుగ కూడా వస్తూ ఉంటుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!