Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898AD’ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉంది.
ఈ సినిమాను 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టిపెట్టినట్లు సమాచారం.ఇప్పటికే సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను మే 22న ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.త్వరలోనే మేకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.