NTV Telugu Site icon

Breast Feeding: పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఫోన్ వాడడం ఎంత డేంజరో తెలుసా ?

Phone

Phone

Breast Feeding: శిశువు ఆరోగ్యానికి తల్లి పాలు చాలా ముఖ్యమైనవి. అయితే దాన్ని తాగే విధానం కూడా సరిగ్గా ఉండాలి. చాలా మంది స్త్రీలు తమ బిడ్డలకు పాలు పట్టేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడే అలవాటు కలిగి ఉంటారు. అయితే ఇది పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరం. స్త్రీ జీవితంలో గర్భం ఎంత ముఖ్యమో, ప్రసవం తర్వాత రోజులు కూడా అంతే ముఖ్యం. ప్రసవం తర్వాత కూడా స్త్రీ తన ఆరోగ్యం, తన బిడ్డ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా తొలినాళ్లలో బేబీ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నవజాత శిశువు ఆరోగ్యానికి తల్లి పాలు చాలా ముఖ్యమైనవి. వాటిని సరిగ్గా పట్టిస్తేనే పిల్లల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

Read Also: Karimnagar Crime: తండ్రిపై కొడుకు దాడి.. బ్యాట్ తో కిరాతకంగా కొట్టి..

నవజాత శిశువుల తల్లులకు పాలిచ్చే సమయంలో విశ్రాంతి తీసుకునే సమయం తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లులు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తుంటారు. అది సరికాదని డాక్టర్లు హెచ్చిరిస్తున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు దగ్గరగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, తల్లి పాలివ్వడంలో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం వల్ల తల్లి దృష్టి బిడ్డపై తక్కువవుతుందని నిపుణులు భావించారు.

Read Also: Amritpal Singh: ఐదు వాహనాలు మార్చి.. గన్ పాయింట్‌లో బైక్ చోరీ.. తప్పించుకున్న ఖలిస్తానీ లీడర్

స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల తల్లికి, బిడ్డకి మధ్య కమ్యూనికేషన్‌పై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఆ సమయంలోనే తల్లికి వెన్ను నొప్పి రావచ్చు. మొబైల్ వాడకం వల్ల తల్లుల మధ్య పిల్లలతో కమ్యూనికేషన్ తగ్గిపోతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ వాడకం పిల్లలలో ఒత్తిడిని కలిగిస్తుందని… వారి జ్ఞాపకశక్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తేలింది. నర్సింగ్, హెల్త్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం తల్లి పాలిచ్చు సమయంలో స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని, తల్లి-శిశువుల పరస్పర చర్యల నాణ్యతపై పరిశీలించింది. స్మార్ట్ ఫోన్ వినియోగం, స్మార్ట్ ఫోన్ వాడకుండా పాలు తాగుతున్న నేపథ్యంలో తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ రెండింటి ఫలితాలు వేర్వేరుగా రావడంతో వైద్యులు పాలిస్తున్న సమయంలో తల్లులు ఫోన్ వాడొద్దని చెబుతున్నారు.