NTV Telugu Site icon

Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ యుద్ధ సమయంలో పలికే నినాదం ఏదో తెలుసా? వింటే గూస్‌బంప్స్ ఖాయం..

Chhatrapati Shivaji

Chhatrapati Shivaji

భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే ఛత్రపతి శివాజీ జయంతి నేడు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ గొప్ప యోధుడు. అలాంటి యోధుడి జన్మధినాన్ని భారత్‏లో ఘనంగా జరుపుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఇదో పెద్ద పండుగ. మాస్టర్ స్ట్రాటజిస్ట్‏గా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మొఘలులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని రూపొందించాడు. 1674లో శివాజీకి చక్రవర్తీగా పట్టాభిషకం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన 15 ఏళ్ల వయసులో మొఘలులపై తన మొదటి దాడిని చేశాడు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసమే ఈ దాడి జరిగింది. దీనినే గెరిల్లా వార్‌ఫేర్ విధానం అంటారు. శివాజీ ఈ కొత్త తరహా యుద్ధానికి ప్రాచుర్యం కల్పించారు. గెరిల్లా వార్‌ఫేర్ సూత్రం ‘హిట్ అండ్ రన్‌వే’. శివాజీ బీజాపూర్‌పై తన గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో దాడిచేసి అక్కడి పాలకుడు ఆదిల్షాను ఓడించి, బీజాపూర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాడు.

READ MORE: KCR: ఒర్లకండిరా బాబు.. దండం పెడతా.. కార్యకర్తలపై కేసీఆర్ అసహనం

ఛత్రపతి శివాజీ మహారాజ్ 1674లో పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఈ సమయంలోనే శివాజీ అధికారికంగా మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఛత్రపతి శివాజీని ‘మరాఠా గౌరవ్’ అని కూడా పిలిచేవారు. ఈ యుద్ధ వీరుడు చేసిన ప్రతి యుద్ధంలో ఓ నినాదం చేసేవాడు.. ఆ నినాదానికి సైనికులు రెచ్చిపోయే వారు. ఆయన గంభీరమైన శైలి కలిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ “నమః పార్వతి పతయే హర హర మహాదేవ్” అని నినదిస్తూ శత్రువులకు మట్టుబెట్టేవాడు. తన కంఠం నుంచి వచ్చే ఆ నినాదం విన్న సైనికుల రోమాలు నిక్కబొడుచుకునేవి. దీంతో కేవలం సుల్తానులే కాకుండా.. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబును కూడా ఉచ్చ పోయించాడు శివాజీ మహారాజ్. ఈ నినాదం ఇటీవల విడుదలైన “ఛావా” సినిమాలో కూడా పెట్టారు. శంభాజీ పాత్ర పోషించిన విక్కీ కౌశల్‌ తన సైనికులను ఉత్తేజపరుస్తూ “నమః పార్వతి పతయే హర హర మహాదేవ్” నినాదం చేస్తాడు. ఈ నినాదం విన్న ప్రేక్షకులకు కూడా గూస్‌బంప్ వచ్చాయి.

READ MORE: Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ హయాంలో పుట్టిన “సాంబార్”.. అసలు కథ ఇదే!