Site icon NTV Telugu

Bathua Leaves Benefits: ఈ ఆకు గురించి మీకు తెలుసా..? ఎంత మేలు చేస్తుందో తెలిస్తే వదిలిపెట్టరు

Batuva

Batuva

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. బతువా చాలా తేలికగా లభించే ఆకుకూర. బతువా ఒక ఆయుర్వేద ఔషధ మొక్క.. ఇది ఎక్కువగా శీతాకాలంలో దొరుకుతుంది. ఈ ఆకుకూరలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కీళ్లనొప్పులను తగ్గించడంలో.. ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. బతువా ఆకు కూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజూ బతువా ఆకుకూరను జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జ్యూస్‌కు బదులు దానితో కూర, లేదంటే చట్నీ, చపాతీలు కూడా చేసుకుని తినవచ్చు. ఈ ఆకుకూర తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

కీళ్లనొప్పి, వాపు తగ్గింపు:
బతువాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది కీళ్ల వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులు ఉన్నవారు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆకుకూరలో ఉండే మినరల్స్ కీళ్ల ఫ్లెక్సిబిలిటీని కాపాడతాయి.. దృఢత్వం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

యూరిక్ యాసిడ్ నియంత్రణ:
గౌట్ వంటి వ్యాధుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో బతువా సహాయపడుతుంది.

ఎముకలు దృఢంగా మారుతాయి:
బతువాలో అధిక మొత్తంలో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. బతువా ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల బలహీనతను నివారించడంలో కూడా సహాయపడుతుంది. బతువాలో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలలో కాల్షియం శోషణను పెంచి బలోపేతం చేస్తుంది.

వీళ్లు బతువా తినకూడదు:
జీర్ణవ్యవస్థ సెన్సిటివ్‌గా ఉన్నవారు దీనిని తినకూడదు. బతువాను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నిజానికి బతువాలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకుంటే అతిసారం, కడుపునొప్పి, మలబద్ధకం వంటి వ్యాధులు వస్తాయి .

చర్మం సెన్సిటివ్
బతువాను అలెర్జీ ఉన్నవారు కూడా తినకూడదు. ఆ సమస్యలు ఉన్నవారు తింటే చర్మంపై దురద, ఎరుపు.. శ్వాస సంబంధిత సమస్య వస్తుంది. బతువాను తగిన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం.

Exit mobile version