NTV Telugu Site icon

Health Tips: రన్నింగ్ పూర్తి చేసిన వెంటనే చేయకూడని పనులు

Running

Running

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి రన్నింగ్ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ప్రతి రోజూ ఉదయం పూట పార్కు లేక ఫుట్‌పాత్‌పై పరుగులు తీస్తుంటారు. ఇది అద్భుతమైన వ్యాయామంగా పరిగణించబడుతుంది. మీరు ప్రతిరోజూ 20 నుంచి 30 నిమిషాలు పరిగెత్తినట్లయితే, అది మీ గుండె, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రోజూ ఎక్కువ సమయం కూర్చుని పనిస్తేన్నట్లయితే.. జిమ్‌కి వెళ్లడానికి, వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే, ఉదయాన్నే వేగంగా నడవడం లేదా పరుగెత్తడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మీరు నడుస్తున్న సమయంలో, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని తప్పులు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

READ MORE: Kolkata doctor case: గవర్నర్ ఆనంద బోస్ రాసిన రహస్య లేఖను తిరస్కరించిన సీఎంవో

పరుగు తర్వాత హాయిగా కూర్చోవడం మానుకోండి
చాలా సేపు పరిగెత్తిన వ్యక్తులు అలసిపోయినట్లు అనిపించినప్పుడు, వెంటనే కూర్చోవడం లేదా మంచం మీద పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. పరుగెత్తిన వెంటనే విశ్రాంతి లేదా నిద్రపోకూడదు. లాంగ్ రన్నింగ్ అనేది ఒక రకమైన హై ఇంటెన్సిటీ వర్కవుట్, కాబట్టి రన్నింగ్ తర్వాత శరీరంలో రక్త ప్రసరణ, హృదయ స్పందన రేటు అధికంగా ఉంటుంది. ఇది సాధారణీకరించడానికి సమయం పడుతుంది. ఇలా చేయడం వల్ల మైకం లేదా గుండెకు సంబంధించిన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల, మీరు అకస్మాత్తుగా పరుగును ఆపి విశ్రాంతి తీసుకోకండి. ఇలా కాకుండా నెమ్మదిగా నడవడం, లేదా వ్యాయామం చేయడం వంటివి ప్రారంభించండి. మీరు నడవవచ్చు లేదా తేలికపాటి వ్యాయామం చేయవచ్చు.

READ MORE:Rainy Season: వర్షాకాలంలో బీర్లు తాగితే మలేరియా, డెంగ్యూ తప్పువు!… ఆశ్చర్యంగా ఉందా.. ఇది చదవండి

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి
పరుగు తర్వాత, శరీరానికి శక్తి, హైడ్రేషన్ రెండూ అవసరం. అందువల్ల తగినంత నీరు త్రాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా.. మీరు ఎలక్ట్రోలైట్ పానీయాన్ని కూడా తీసుకోవచ్చు. మీరు ప్రతిరోజూ హై ఇంటెన్సిటీ వర్కవుట్ చేస్తుంటే.. మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి. ఇది కండరాల పునరుద్ధరణ, శక్తికి సహాయపడుతుంది.