కర్ణాటకలో భారీ మెజార్టీతో గెలిచినా కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటు కోసం తీవ్ర ఉత్కంఠ పోరు నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిపోటీ నెలకొంది. అయితే ఈ పరిణామాల మధ్య డీకే శివ కుమార్ తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు.
Also Read : Karthik Subbaraj: ఈ దీపావళికి బాంబుల మోతనే…
ప్రెస్ మీట్ లో డీకే శివ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలాంతా సహకరించారు అని తెలిపాడు. మద్దతుదారులతో భేటీ అనంతరం డీకే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డాను అని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను.. నా అధ్యక్షతన 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాను.. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చాను అని డీకే శివ కుమార్ అన్నారు.
Also Read : Jennifer Garner: తండ్రి సినిమాలకు ఓటు… తల్లిప్రేమవైపే రూటు…!!
కాంగ్రెస్ నేతలంతా గెలుపు కోసం సహకరించారని డీకే శివ కుమార్ అన్నారు. నాకు సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవు అని డీకే వెల్లడించారు. నా పుట్టిన రోజు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు అని ఆయన అన్నారు. నాకంటూ ఉన్న మద్దతుదారుల సంఖ్యను నేను చెప్పను అంటూ ఆయన చెప్పారు. సీఎం ఎవరన్నదానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని డీకే శివ కుమార్ పేర్కొన్నారు. సోనియా, రాహుల్, ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను.. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది అని డీకే తెలిపాడు.