DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar Swearing as Karnataka CM: కర్ణాటక రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK. Shivakumar) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్ లో సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమంl డీకే శివకుమార్‌తో పాటు 10 మందికి పైగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
కొత్త ప్రభుత్వంలో జి. పరమేశ్వర (G. Parameshwara) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే మంత్రి మండలి కూర్పుపై చర్చలు పూర్తయ్యాయని సమాచారం. నేడు ఉదయం 10 గంటలకు తానే స్వయంగా మంత్రివర్గ జాబితాను ప్రకటిస్తానని డీకే శివకుమార్ ఇప్పటికే వెల్లడించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం లోక్ భవన్లో సుమారు 4,000 మందికి పైగా కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు. కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ లు హాజరుకానున్నారు. అలాగే తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. మొత్తం 35 మంది VVIPలకు ఆహ్వానాలు అందించినట్లు సమాచారం. మాజీ ప్రధాని దేవే గౌడ, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై, జగదీష్ షెట్టర్, వీరప్ప మొయిలీ లకు కూడా డీకే స్వయంగా ఆహ్వానాలు పంపించారు.
ముఖ్యమంత్రి పదవిని చేపట్టే ముందు డీకే శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు బెంగళూరులోని అజ్జయ్య మఠంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే నేడు ఉదయం కూడా పలు దేవాలయాల్లో దర్శనాలు చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. నేడు ప్రమాణ స్వీకారం చేసే వారిలో యతీంద్ర సిద్ధరామయ్య, డాక్టర్ జి. పరమేశ్వర, యు.టి. ఖాదర్, కె.జె. జార్జ్, కృష్ణ బైరే గౌడ, ఎం.బి. పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కె.హెచ్. మునియప్ప, దినేష్ గుండూ రావు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!