ఎంపీ డీకే ఆరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై డీకే అరుణ మాట్లాడుతూ.. గత 38 ఏళ్లుగా నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను.. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. అగంతకుడు వచ్చిన సమయంలో ఇంట్లో మా కూతురు, మనవరాలు ఉంది. ఆ సమయంలో అలజడి విని మా పాప, మనవరాలు లేచి ఉంటే.. ఆ వ్యక్తి దాడికి యత్నించే వాడేమో.. నేను నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ పరంగా ఎన్నో సార్లు ఇబ్బందికి గురయ్యాను. లోకల్ గా అదనపు భద్రత కల్పించాలని చాలాసార్లు పోలీస్ అధికారులను కోరాను. అయినా వారు పట్టించుకోలేదని తెలిపారు.
Also Read:Sara Ali Khan : చూపులతో గుచ్చేస్తున్న ‘సారా అలీఖాన్’ లుక్స్..
ఈ ఘటనతో ఐనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఒక ఎంపీగా ఉన్నాను.. ప్రజాప్రతినిధి ఐన నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.. ఉదయం సిఎం రేవంత్ కాల్ చేశారు.. ఘటపై వివరాలు అడిగారు.. భద్రత కల్పిస్తామని చెప్పారు.. హైదారాబాద్ సీపీ సీవీ ఆనంద్ కూడా కాల్ చేసి మాట్లాడారు. ఇంట్లో ఒక్క వస్తువు కూడా చోరీ చేయలేదు.. కాబట్టే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి.. పక్కా రెక్కీ చేసి మరీ.. ఇంట్లోకి ప్రవేశించాడు. ఉద్దేశ పూర్వకంగానే జరిగిందని భావిస్తున్నా.. నేను మహిళను, మా ఇంట్లో కూడా కూతురు, మనవరాలు.. అందరం మహిళలే ఉంటున్నాం కాబట్టి భద్రత అవసరం అని అన్నారు.