PM Narendra Modi: ఈ ఏడాది దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి కానుకలు అందించేందుకు సిద్ధం అవుతున్నారు. దీపావళికి 75 మంది యువతకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు. దీపావళికి రెండు రోజుల ముందు శనివారం వారితో వర్చువల్‌గా సమావేశమై మాట్లాడనున్నారు. 75 వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. శనివారం(అక్టోబర్ 22) రోజున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించింది. పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్‌మెంట్ లెటర్లను అందించనున్నారు.
Mission Life: ఐక్యతతోనే పర్యావరణ పరిరక్షణ.. ‘మిషన్ లైఫ్’ గ్లోబల్ లాంచ్‌లో ప్రధాని
అక్టోబర్ 22న ఉదయం 11.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ రోజ్‌గార్ మేళాను ప్రారంభించిన ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రధాని గిఫ్ట్ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్‌ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పాల్గొననున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ ఒడిశా నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవియా గుజరాత్ నుంచి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చండీగఢ్ నుంచి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు.
