Site icon NTV Telugu

Diwali 2025 Festival Date: కన్‌ఫ్యూజన్‌లో జనాలు.. దీపావళి పండగ ఏ తేదీనో తెలుసా?

Diwali 2025 Festival Date

Diwali 2025 Festival Date

‘దీపావళి’ పండుగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దీపాల పండుగ కోసం దేశంలోని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 2025 దీపావళి పండగ తేదీ విషయంలో జనాలు కాస్త కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కొంతమంది జ్యోతిష్కులు పండగ అక్టోబర్ 20న వస్తుందని చెబుతుండగా.. మరికొందరు అక్టోబర్ 21న అని అంటున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగను ఏ రోజున జరుపుకోవాలో తెలుసుకుందాం.

దేశంలోని ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’.. దీపావళి పండగను అక్టోబర్ 20న జరుపుకోవాలని స్పష్టం చేసింది. దీపావళి పండగ తేదీల గందరగోళం నేపథ్యంలో ఇటీవల కౌన్సిల్ ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో దీపావళి తేదీపై సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన సూత్రాలు, లేఖనాత్మక లెక్కల ఆధారంగా.. పూర్తి ప్రదోష కాలం అక్టోబర్ 20న మాత్రమే ఉంటుందని తేల్చారు. అక్టోబర్ 21న అమావాస్య మూడున్నర గంటలకు పైగా ఉండటంతో.. నక్త ఉపవాసం విచ్ఛిన్నం చేయడానికి ఆ రోజు సమయం ఉండదు. అందుకే అక్టోబర్ 20న దీపావళిని జరుపుకోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించింది.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన రో-కో!

అక్టోబర్ 4న కాశీ విద్వత్ పరిషత్ సమావేశం కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రామచంద్ర పాండే అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కాశీ విద్వత్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామనారాయణ ద్వివేది హాజరయ్యారు. ద్రిక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం అమావాస్య తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 21న రాత్రి 9:03 గంటలకు ముగుస్తుంది. దీపావళి నాడు లక్ష్మీ, గణేశులను పూజించడానికి అత్యంత పవిత్రమైన సమయం సాయంత్రం 7:08 నుంచి 8:18 వరకు. ప్రదోష కాలం, స్థిరమైన లగ్నంతో సమానంగా ఉండే ఈ సమయం లక్ష్మీదేవి, గణేశుడి ఆశీస్సులు పొందడానికి అనువైనది.

Exit mobile version