2023 Diwali Money Remedies with One Rupee: హిందూ మతంలో ‘దీపావళి’ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఐదు రోజుల పండుగ ధంతేరస్ నుంచి ప్రారంభమై భాయ్ దూజ్ రోజున ముగుస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించే సంప్రదాయం హిందూ మతంలో ఉంది. దీపావళి రోజు రాత్రి మహాలక్ష్మి భూమిని దర్శించుకుంటుంది. ఈ పరిస్థితిలో మహాలక్ష్మి ఆశీర్వాదం పొందడానికి దీపావళి రోజు రాత్రి కొన్ని పరిహారాలు చేయాలి. అవి మీ అదృష్టాన్ని మార్చగలవు.
దీపావళి రోజున ఒక్క రూపాయి నాణెంతో ఈ పరిహారం చేయండి:
దీపావళి రోజు చేసే చిన్న చిన్న చర్యలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీకు అందిస్తాయి. కానీ ఈ చర్యలు చేయడానికి సరైన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీపావళి రోజున లక్ష్మీదేవి మరియు గణేశుడిని పూజించే సమయంలో రూపాయి నాణెం కూడా పూజిస్తారు. అలా చేయడం వలన అదృష్టం మీ వెంటే ఉంటుంది.
# లక్ష్మీ దేవి పూజ సమయంలో ఆమె పాదాల వద్ద ఒక రూపాయి నాణెం ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఈ నాణేన్ని రాత్రంతా ఇంటి మీద వెలుగుతున్న దీపం కింద ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ నాణెం జాగ్రత్తగా భద్రపరచండి. ఇలా చేయడం వలన మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు.
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి పూజలో ఉంచిన ఒక రూపాయి నాణెం ఎరుపు రంగు దారంలో కట్టి మీ ఇంటిలో భద్రంగా ఉంచండి. దీనితో మీ సంపద పెరుగుతూనే ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
# దీపావళి రోజు రాత్రి ఆవనూనె దీపాంత కింద ఒక రూపాయి నాణెం ఉంచి.. ఆపై దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన ప్రతి పనిలో విజయం ఉంటుంది.
# దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి.. ఒక రూపాయి నాణెంను కుంకుమ , అక్షింతలు మరియు కల్వేపై ఉంచండి. పూజ తరువాత ఈ నాణెంను డబ్బు దాచే ప్రదేశంలో భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉంటాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)