Underwater Kiss : చైనా మహిళా టూరిస్టు(24) తనను నీటి అడుగున్న వేధించాడని ఆరోపించడంతో మలేషియా డైవింగ్ శిక్షకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆరిఫ్ అబ్దుల్ రజాక్ తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సబా రాష్ట్రంలోని సెంపోర్నా సముద్రంలో డైవింగ్ చేస్తున్న సమయంలో ఫ్రీలాన్స్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల వ్యక్తి.. మహిళను వేధించాడని ఇన్‌చార్జి యాక్టింగ్ ఆఫీసర్ తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డైవింగ్ శిక్షకుడు, బాధితురాలి మధ్య జరిగిన సంఘటనల స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయి. అందులో ఒక ఫోటో స్త్రీని ముద్దుపెట్టుకున్నట్లు చూపిస్తుంది.
Read Also: CM YS Jagan To Visit Vizag: రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
బాధితురాలు చైనాలోని తన స్వస్థలానికి తిరిగి వెళ్లే ముందు సెంపోర్నా పోలీసులకు వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది. ఆదివారం అర్ధరాత్రి 12.50 గంటలకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి గురువారం వరకు రిమాండ్ విధించారు. కోవిద్ మహమ్మారి నుండి ప్రస్తుతం కోలుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర పర్యాటక పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీసిందని పర్యాటక, సంస్కృతి, పర్యావరణ మంత్రి- క్రిస్టినా లీవ్ సోమవారం అన్నారు.
Read Also:Cumin prices: బాబోయ్ జీలకర్ర.. క్వింటాల్ ధర రూ.56 వేలా!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కోవిడ్-19 మహమ్మారి నుండి టూరిజం పరిశ్రమ కోలుకుంటున్నందున ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా సెంపోర్నా జిల్లాలో.. సబాలో పర్యాటకం ఇమేజ్‌ను బాగా ప్రభావితం చేస్తాయి. నాణ్యమైన సేవను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించాలని ఈ రాష్ట్రంలోని ట్రావెల్ ఏజెంట్లందరినీ కోరుతున్నాను. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలి’. అని మంత్రి పిలుపు నిచ్చారు.
