దివి..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ షో తో ఈ భామ బాగా పాపులరిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ఈ భామ సినిమాలలో అవకాశాలు రాబట్టింది.వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ దివి దూసుకుపోతుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాలో దివి కాలేజ్ స్టూడెంట్‌గా నటించి మెప్పించింది.. ఆ పాత్ర నిడివి చిన్నదే అయినా కూడా మహేష్ తో కలిసి నటించడంతో అందరి దృష్టి దివి పై పడింది. గత ఏడాది పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది.అయితే తాజాగా ఈ భామ ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్ లో తన హాట్ అందాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
అలాగే ఈ భామ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాలో న్యూస్ రీడర్ గా నటించింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.నిత్యం హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తన సరికొత్త అందాలు ప్రదర్శిస్తూ గ్లామర్ షోకి సరికొత్త నిర్వచనం చెబుతుంది.. మత్తెక్కించే కళ్ళు చూపు తిప్పుకోలేని సొగసుతో దివి మాయ చేస్తుంది.తన సహజ అందం తో దివి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.దివి ఎలాంటి డ్రెస్ లో మెరిసినా కుర్రాళ్లు ఆమె అందానికి మైమరచిపోతున్నారు…తాజాగా దివి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది.తెల్ల చీరలో దివి దేవ కన్యలా మెరిసింది. తెల్ల చీరలో తన బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది.తన హాట్ ఫోటోలకు దివి చిలిపిగా కామెంట్ కూడా చేసింది.నిన్ను తలుచుకుంటూ కొండల్లో గుట్టల్లో ఒంటరిగా తిరిగేస్తున్నా అంటూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.