NTV Telugu Site icon

Mohammad Rizwan: మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడంపై వివాదం.. ఐసీసీలో ఫిర్యాదు

Rijwan

Rijwan

Mohammad Rizwan: పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌ వివాదంలో చిక్కుకున్నారు. వాస్తవానికి పాకిస్థాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేసాడు. ఇప్పుడు ఈ అంశంపై ఐసీసీలో ఫిర్యాదు దాఖలైంది. మహ్మద్ రిజ్వాన్‌పై సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఆట స్ఫూర్తికి విరుద్ధమని వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: Shoaib Akhtar: టీమిండియా ముందు పాక్ ఓ చిన్న పిల్లల జట్టులా కనిపించింది..

నిజానికి సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఇటీవల కూడా వార్తల్లోకెక్కారు. పాకిస్థాన్ యాంకర్ జైన్ అబ్బాస్‌పై వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జైన్ అబ్బాస్ తన ట్వీట్‌తో భారతీయులను, హిందూ మతాన్ని గాయపరిచారని వినీత్ జిందాల్ ఆ సమయంలో అన్నారు. దాంతో జైన్ అబ్బాస్ ఇండియా విడిచి వెళ్ళాడు. ఇదిలా ఉంటే.. మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు.. టీ20 ప్రపంచకప్ 2021లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డ సమయంలో కూడా మహమ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేశాడు.

Read Also: Asaduddin Owaisi: భారతదేశ విభజనపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..

మరోవైపు మహ్మద్ రిజ్వాన్ తాజాగా గాజాకు మద్దతుగా ట్వీట్ చేశారు. ఈ విషయం ఐసీసీకి చేరింది. కానీ ఐసీసీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైదానం వెలుపల ఆటగాడు చేసేది మా పరిధిలో లేదని ఐసీసీ పేర్కొంది. ఈ అంశం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిధిలోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరుకుంటే మహ్మద్ రిజ్వాన్‌పై చర్యలు తీసుకోవచ్చు.