NTV Telugu Site icon

DisneyIndia: అంబాని చేతికి ‘డిస్నీ ఇండియా’.. అన్ని కోట్లు పెట్టారా?

Disney

Disney

ప్రముఖ అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ‘డిస్నీ ఇండియా అధినేత వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ తన వ్యాపారాన్ని భారతదేశంలో కూడా విస్తరించాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. టెలివిజన్‌తో సహా మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి పలువురు వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇప్పటికే భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియాను కొనుగోలు చేసే రేసులో ఉన్నట్లు గతంలో చాలా వార్తలు వినిపించాయి..

ఇప్పుడు అదే నిజమైంది.. జియో నెట్వర్క్ అధినేత ముకేశ్ అంబానీ డిస్నీ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా తన ఓటీటీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా చర్చలు జరుగుతుండగా, ఇన్నాళ్లకు ఈ చర్చలు ఫలించినట్లు తెలుస్తుంది.. రిలయన్స్ 61 శాతం వాటాలను కొనుగోలు చేసింది.. ఇక మిగిలిన 39శాతం వాటాను డిస్నీ కలిగి ఉంటుంది. ఇంతకీ ఎంత ధరకు కొనుగోలు చేసిందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ముకేశ్ అంబానీ డిస్ని కోసం 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టబోతున్నట్లు సమాచారం. మనదేశ కరెన్సీలో సుమారుగా రూ.12,400 కోట్లకు సమానం. ఈ ఎగ్రిమెంట్ ఇరువురు వాటాదారులకు లాభం కలిగేలా డీల్ కుదుర్చుకున్నారట. రిలయన్స్ గ్రూప్‌తో పాటు డిస్నీ రెండూ ఈ డీల్‌తో భారీగా లాభపడనున్నాయి.మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డిస్నీ , రిలయన్స్ భారతదేశంలో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేయడానికి బైండింగ్ ఒప్పందంపై సంతకం చేశాయి.. ఇది అతి పెద్ద డీల్ అని, దీంతో లాభాలు కూడా పొందవచ్చు అని ప్రముఖులు అంటున్నారు..

Show comments