NTV Telugu Site icon

Disney+ Hotstar down: డిస్నీ+ హాట్‌స్టార్ డౌన్.. నెట్టింట ట్రోల్స్ వెల్లువ

6

6

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ సేవలు సాంకేతిక కారణాలతో ఇండియాలో నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టును చూసేందుకు ప్రయత్నిస్తున్న కస్టమర్లు.. తమకు యాప్ ఓపెన్ కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. వేలాదిగా యూజర్లు ఎర్రర్ స్క్రీన్ షాట్లను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్ ఈ విషయంపై స్పందించింది. యాప్‌లు మరియు వెబ్‌లో సేవలో ఊహించని సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి తమ టెక్ బృందం పని చేస్తున్నట్లు వెల్లడించింది.

Also Read: Asia Cup 2023: ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం!

ఎక్కువ మంది యూజర్లు ఒకేసారి లాగిన్ కావడంతోనే ఈ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్ కావడం పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ , జైపూర్, లక్నో, కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్ , ముంబై తదితర ప్రాంతాలకు చెందిన యూజర్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. తమకు 45 నిమిషాల పాటు ఈ సమస్య తలెత్తిందని కొందరు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

https://twitter.com/AjaySharma9059/status/1626492832294010881