NTV Telugu Site icon

AP Disaster Management Agency: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక

Imd

Imd

ఏపీకి మరోసారి తుపాను ప్రభావం పొంచి ఉంది. ఐఎండీ సూచనల ప్రకారం తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. ఇది దాదాపు పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 700 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ ఆగ్నేయంగా 750 కి.మీ, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి ఆగ్నేయంగా 730 కి.మీ. దూరంలో ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపటికి( అక్టోబర్ 23) నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, వాయువ్య దిశగా కదులుతూ గురువారం ( అక్టోబర్ 24) ద్వారా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడుతుంది. ఆ తరువాత అక్టోబర్ 24వ తేదీ రాత్రి – అక్టోబర్ 25 ఉదయంలోపు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

READ MORE: Chandrababu: అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ పాట.. మామ చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెషన్ వేరే లెవల్

దీని ప్రభావంతో అక్టోబరు 24 & 25న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

READ MORE:Hyderabad: మాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు..