NTV Telugu Site icon

Sleeping With Jeans: జీన్స్ వేసుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

Sleeping With Jeans

Sleeping With Jeans

Sleeping With Jeans: జీన్స్ మన ఫ్యాషన్‌లో భాగమైపోయింది. కానీ, రాత్రిపూట వీటిని ధరించి నిద్రించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే జీన్స్ సాధారణంగా బిగుతుగా ఉండటమే కాకుండా.. గాలి సరిగ్గా ప్రసరించని డెనిమ్ ఫాబ్రిక్‌తో తయారు చేయబడింది. ఇలాంటి బట్టలు వేసుకుని పడుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. జీన్స్ చెమటను పీల్చుకోడు. దీని వల్ల చర్మంపై తేమ ఎక్కువగా ఉండి ఫంగస్, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా దురదలు, దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. జీన్స్ శరీరాన్ని వేడి చేస్తుంది. ఇది నిద్ర రాకుండా చేస్తాయి. టైట్ జీన్స్ రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని వల్ల చాలా అవయవాలకు సరైన రక్త సరఫరా జరగదు. జీన్స్ పొట్టపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. జీన్స్ నడుము, తొడలు, పిరుదులపై ఫిట్ గా ఉంటుంది. దీనివల్ల నొప్పికి కారణం కావచ్చు. జీన్స్ గర్భాశయం, పొత్తికడుపుపై ​​ఒత్తిడి తెస్తుంది. దీంతో బహిష్టు సమయంలో ఎక్కువ నొప్పి వస్తుంది.

Read also: Mallu Bhatti Vikramarka: ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు.. బట్టి విక్రమార్క కౌంటర్..

అయితే నిద్రిస్తున్నప్పుడు ఇలాంటి దుస్తులు ధరించండి..

కాటన్ దుస్తులు చర్మానికి మృదువుగా చెమటను బాగా పీల్చుకుంటాయి. సిల్క్ దుస్తులు చర్మంపై చల్లగా, మృదువుగా ఉంటాయి. బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు రుతుక్రమం ఉన్న స్త్రీలు జీన్స్‌కు బదులుగా కాటన్ వంటి సున్నితమైన బట్టతో చేసిన వదులుగా ఉండే దుస్తులను ధరించాలి.
Ponnam Prabhakar: తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చాం..