Site icon NTV Telugu

Karnataka: ప్రయివేట్ పార్టీ పేరుతో భార్యల మార్పిడి.. తర్వాత..

Karnataka

Karnataka

భార్య మార్పిడి, గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇచ్చిపుచ్చుకోవడం వంటి డర్టీ గేమ్‌లు కర్ణాటకలో బట్టబయలయ్యాయి. హరీష్, హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అరెస్ట్ చేసింది. వీరిద్దరూ ప్రైవేట్ పార్టీ పేరుతో ఈ జుగుప్సాకరమైన గేమ్‌ను నడుపుతున్నారు. వీరు మహిళలను బలవంతంగా, బ్లాక్ మెయిల్ చేస్తూ దోపిడీ చేశారని తేలింది. ఓ మహిళ సీసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. బలవంతంగా శృంగారం చేసేలా ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. నిందితులు, వారికి తెలిసిన వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశారని బాధితురాలు వెల్లడించింది. ఆమె నిరాకరించడంతో తన ప్రైవేట్ ఫోటోలను బయటపెడతానని బెదిరించినట్లు తెలిపింది.

READ MORE: Jaya Bachchan: లోక్‌సభ ఘటనపై జయా బచ్చన్ హాట్ కామెంట్స్.. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వ్యాఖ్య

ఒక సీనియర్ పోలీసు అధికారిని ఈ వివరాలు వెల్లడించారు. “నిందితుడు బాధితురాలి నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడు. ఇతరులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాలు జరిగాయి. బెంగళూరు శివార్లలో ప్రైవేట్ పార్టీలను నిర్వహించేందుకు నిందితులు వాట్సాప్ గ్రూపులను ఉపయోగించారు. ఇది ఒక సామాజిక కార్యక్రమంగా ప్రచారం చేశారు. విచారణలో బాధితులను బ్లాక్ మెయిల్ చేసేందుకు నిందితులు ఉపయోగించిన మహిళలకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. నిందితుల్లో ఒకరితో మహిళకు సంబంధం ఉంది. ” అని పేర్కొన్నారు.

READ MORE: Sritej Health Bulletin: శ్రీతేజ్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Exit mobile version