Site icon NTV Telugu

Mahua Moitra: మహువా మొయిత్రాకు షాకిచ్చిన కోర్టు.. దెబ్బకు బంగ్లా ఖాళీ

Mahua Moitra

Mahua Moitra

TMC EX MP: లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసింది. ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమెకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసుపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇవాళ బంగ్లా ఖాళీ చేయడంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ విభాగ అధికారులు ఆ ప్రభుత్వ బంగ్లాకు తాళం వేసుకుని వెళ్లిపోయారు.

Read Also: NZ vs PAK: న్యూజిలాండ్ స్టార్ ఓపెన‌ర్‌కు కరోనా పాజిటివ్.. ఇది రెండో కేసు!

కాగా, డిసెంబరు 8న మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీలోగా ఆమెకు కేటాయించిన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలంటూ గతంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ విభాగ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.. కానీ, ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో డీఓఈ అధికారులు తగిన చర్యలు చేపట్టింది.

Read Also: RBI Penalty: ఐదు బ్యాంకులపై రూ.50 లక్షల జరిమానా విధించిన రిజర్వ్ బ్యాంక్

ఇక, లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని.. అలాగే, పార్లమెంట్ లాగిన్‌ను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు పేర్కొనింది. ఈ నివేదికకు లోక్‌సభ ఆమోదం లభించడంతో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి.. సభ నుంచి బహిష్కరించింది.

Exit mobile version