Director Son: హీరోగా ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ డెరైక్టర్ కొడుకు!
- హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మరో దర్శకుడు కుమారుడు సిద్ధం
- హీరోగా మారనున్న దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజ
- ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Teja son amitov Teja to debut as hero soon: తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు దాదాపు అన్ని సినీ పరిశ్రమలలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వసాధారణం. హీరోల వారసులతోపాటు హీరోయిన్ల వారసులు అలాగే దర్శకులు, నిర్మాతల వారసులు కూడా నటులుగా ఇతర టెక్నీషియన్లుగా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మరో దర్శకుడు కుమారుడు హీరోగా మారేందుకు రంగం సిద్ధమైంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎన్నో యూత్ ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేసి ప్రస్తుతానికి సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు తేజ. దర్శకుడు తేజ తన కొడుకు అమితోవ్ తేజను హీరోగా పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ లేదా డిసెంబర్ నుండి షూట్ కి వెళ్లొచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
దర్శకుడు తేజ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. చివరిగా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో హిట్ అందుకున్న ఆయన దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా అహింస అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాదు విమర్శకుల దగ్గర కూడా దారుణమైన విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తేజ కుమారుడి సినిమాకి తేజనే దర్శకత్వం వహించబోతున్నారు అని తెలుస్తోంది. అయితే నిర్మాత ఎవరు? అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. తేజ స్వయంగా సినిమా నిర్మిస్తారా? లేక బయట నిర్మాత ఎవరైనా సినిమా అని నిర్మిస్తారా? అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
తాజావార్తలు
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?