Uday Kiran Dead Reason: ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో నాకు తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uday Kiran Dead Reason: టాలీవుడ్ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అకస్మాత్తుగా చనిపోయేందుకు కారణం ఎంటో తనకు తెలుసంటూ డైరక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఉదయ్ కిరణ్‌కి అప్పట్లో లేడీ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉండేది. అయితే తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలోనే విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సినిమాల సక్సెస్ సంగతి సరే, తన కెరీర్ ఎలాగో సాగుతుంది అనుకుంటుండగా ఉదయ్ కిరణ్ అర్థాంతరంగా తనువు చాలించారు. ఉదయ్ సూసైడ్ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలో చాలా మందికి బాధను కలిగించింది.
Read Also: CM Priyamani : ముఖ్యమంత్రి రేసులో హీరోయిన్ ప్రియమణి.. ఆల్ ది బెస్ట్ అంటున్న అభిమానులు
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ సూసైడ్ పై చాలా మంది కామెంట్స్ చేస్తారు. కానీ.. కచ్చితమైన కారణాలను ఎవరూ చెప్పలేదు. అయితే దర్శకుడు తేజ మాత్రం రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తనకు తెలుసని, తను ఆత్మహత్య చేసుకోవటానికి కొన్ని రోజుల ముందు తనకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పారని అన్నారు. ఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఆ ధైర్యం లేదని చెప్పిన తేజ.. తాను చనిపోయే లోపు ఏదో ఒక సమయంలో ఆ విషయాన్ని బయట పెడతానని అన్నారు. చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ ను తేజ హీరోగా పరిచయం చేశారు. తర్వాత నువ్వు నేను చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సక్సెస్‌తో టాప్ హీరోగా ఎదిగాడు. తేజ ప్రస్తుతం దర్శకత్వం చేసిన అహింస సినిమా రిలీజ్ కానుంది. ఇందులో దగ్గుబాటి హీరో అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నారు.
- Tags
- ahimsa
- Chitram
- Nuvvu Nenu
- Teja
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!