NTV Telugu Site icon

Suryakiran : బిగ్ బ్రేకింగ్…డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత..

Suryaa

Suryaa

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు.. తెలుగులో సత్యం సినిమాతో పరిచయమైన డైరెక్టర్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పచ్చ కామెర్లు రావడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు.. ఆయన మరణం పై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు..

ఈయన మాస్టర్‌ సురేష్‌ పేరుతో దాదాపుగా 200లకు పైగా సినిమాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించారు.. ‘రాక్షసుడు’, ‘దొంగమొగుడు’, ‘స్వయం కృషి’, ‘సంకీర్తన’, ‘ఖైదీ నం.786’, ‘కొండవీటి దొంగ’ చిత్రాల్లో నటించారు.. ఆ తర్వాత తెలుగులో ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన పేరు సూర్యకిరణ్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత ‘ధన 51, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజుభాయ్‌’, ‘చాప్టర్‌ 6’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు..

తమిళ్లో కూడా పలు సినిమాలకు దర్శకుడుగా పనిచేసారు.. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.. హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కొన్ని ఏళ్లు బాగానే ఉన్న వీరు మనస్పర్థలు కారణంగా విడిపోయారు.. ఇక సూర్యకిరణ్‌ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం చెన్నైలో జరగనున్నాయి..