Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Director Ss Rajamouli Birthday Today

SS Rajamouli: అసాధ్యుడు… అనితరసాధ్యుడు!

Published Date :October 10, 2022 , 6:05 am
By Subbarao N
SS Rajamouli: అసాధ్యుడు… అనితరసాధ్యుడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Director SS Rajamouli Birthday today: అదృష్టవంతునికి అన్నీ కలసి వస్తాయంటారు; అలాగే అసాధ్యులు అనుకున్నది సాధించి తీరతారనీ చెబుతారు. అదృష్టం కలిసొచ్చిన అసాధ్యుడు దర్శకుడు రాజమౌళి. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా నీరస పడిన ప్రతీసారి ‘మాస్ సినిమాలు తీసుకొనే మనకూ అవార్డులు వస్తాయా?’ అంటూ మనవాళ్ళే గేలి చేసేవారు. అలాంటి వారికి మాస్ సినిమాలతోనూ బెస్ట్ మూవీస్ తెరకెక్కించవచ్చునని నిరూపించిన ఘనుడు రాజమౌళి. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎప్పుడూ వెలుగుని తెలుగు సినిమాకు తన ‘బాహుబలి-1’తో ఆ అపూర్వ గౌరవం సంపాదించి పెట్టారు రాజమౌళి. ‘బాహుబలి’ తొలి భాగం విడుదలకు ముందు, ఆ తరువాత రాజమౌళి సినిమా కెరీర్ ను విభజించ వచ్చు. అంతకు ముందు చిత్రాలలో ఫక్తు ఫార్ములాయే తకధిమితై అంటూ నాట్యం చేసింది. ‘బాహుబలి’ సిరీస్ తో టెక్నాలజీతోనూ ఇంటర్నేషనల్ ఆడియెన్సెస్ ను ఆకర్షించగలనని రుజువు చేసుకున్నారు. అప్పటి నుంచీ రాజమౌళి, ఆయన సినిమాలపై ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారు ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం తన ‘ట్రిపుల్ ఆర్’తోనూ రాజమౌళి సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తరువాత రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’పై ఆరంభం నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొనడానికి, అది రాజమౌళి సినిమా కావడం మొదటి కారణం. ఒకే తరానికి చెందిన యన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరూ మాస్ హీరోలు కలసి నటించడం రెండో కారణం. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు చేసుకొని జనం ఎదురు చూసిన వైనం ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ కనిపించలేదు. ‘ట్రిపుల్ ఆర్’ జనం ముందు నిలిచాక చాలామంది పెదవి విరిచారు. ‘బాహుబలి’ సిరీస్ స్థాయిలో లేదన్నారు. అయినా జనం ఆ సినిమాను పదే పదే చూసి విజయపథంలో పయనించేలా చేశారు. అయితే ‘బాహుబలి-2’ స్థాయి విజయం మాత్రం ‘ట్రిపుల్ ఆర్’కు దక్కలేదు అన్నది నిర్వివాదాంశం! అయినప్పటికీ ‘ట్రిపుల్ ఆర్’ ఇప్పటికీ వార్తల్లో నానుతూ ఉండడమే రాజమౌళి మ్యాజిక్ అని చెప్పాలి.

ఆ సినిమాకు ఆస్కార్ బరిలో దూకే అవకాశాలు ఉన్నాయని ప్రఖ్యాత అమెరికన్ మేగజైన్ ‘వరైటీ’ పేర్కొనడంతో ‘ట్రిపుల్ ఆర్’ మళ్ళీ చర్చనీయాంశమయింది. మన దేశం నుండి ఆస్కార్ బరిలోకి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’ కేటగిరీలో ఎంట్రీగా ఎంపికవుతుందనీ పలువురు ఆశించారు. అది జరగలేదు. కానీ, జనరల్ కేటగిరీలోనే ఆస్కార్ నామినేషన్స్ కోసం ‘ట్రిపుల్ ఆర్’ సిద్ధం కావడంతో మళ్ళీ రాజమౌళి వైపు సినీఫ్యాన్స్ చూపు సాగుతోంది. ఇలా మ్యాజిక్ చేస్తూ సాగుతోన్న రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’కు ఎన్ని ఆస్కార్ నామినేషన్స్ లభిస్తాయో కానీ, ప్రస్తుతం ఆయన పేరు సినీ ఫ్యాన్స్ కు ఓ మంత్రంలా మారింది. ఉత్తరం, దక్షిణం అన్న తేడా లేకుండా అన్ని సినిమా రంగాలు రాజమౌళి నామస్మరణ చేస్తున్నాయి. ఓ తెలుగు దర్శకుడు ఈ స్థాయి సక్సెస్ సాధించడం నిజంగా తెలుగువారందరికీ గర్వకారణమే!

Monster Trailer: మంచు లక్ష్మీ కూతురు కిడ్నాప్.. ?

తెలుగువారికి ‘ఉత్తమ చిత్రం’ విభాగంలో తొలి నేషనల్ అవార్డు సంపాదించి పెట్టిన రాజమౌళి, తెలుగు సినిమాతో ఆస్కార్ నామినేషన్ కూడా సంపాదిస్తే అది ఓ చరిత్రే అవుతుంది. ఆ దిశగా రాజమౌళి సాగాలని ఆశిద్దాం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bahubali
  • director ss rajamouli birthday
  • oscar nominations
  • rrr
  • SS Rajamouli

తాజావార్తలు

  • DC vs MI IPL 2026: రిజ్వీ విధ్వంసం.. ముంబై ఓటమి..

  • India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..

  • Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..

  • Petrol, Diesel, LPG: పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..

  • Sajjala Ramakrishna Reddy: అమరావతి బిల్లు పాసయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు సంబరాలా..?

ట్రెండింగ్‌

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions