NTV Telugu Site icon

Bharateeyudu 2 Public Talk: ‘భారతీయుడు 2’ పబ్లిక్ టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

Bharateeyudu 2 Public Talk

Bharateeyudu 2 Public Talk

Bharateeyudu 2 Public Talk: తెలుగులో క్లాసిక్‌గా నిలిచిపోయే సూపర్ హిట్ చిత్రాలలో ‘భారతీయుడు’ ఒకటి. అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా సేనాప‌తి చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 28 ఏళ్ల తర్వాత భారతీయుడుకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈరోజు (జులై 12) సీక్వెల్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల భారతీయుడు 2 ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భారతీయుడు 2కి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. పెద్దగా ఆకట్టుకోలేదని మరికొంత అంటున్నారు. డైరెక్టర్‌ శంకర్‌కి హాట్సాఫ్‌ అని, అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు అని కొందరు ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. శంకర్ ఇచ్చిన సోషల్‌ మెసేజ్‌ ప్రతి ఆడియన్‌కి రీచ్‌ అవుతుందంటున్నారు.

Also Read: RC16: ‘కరునాడ చక్రవర్తి’కి స్వాగతం.. శివన్న లుక్ వైరల్!

భారతీయుడు 2 మూవీ బోరింగ్‌ అని, ఔడేటెడ్‌ స్టోరీ అని మరికొందరు ఆడియన్స్ అంటున్నారు. స్క్రీన్‌ప్లే అస్సలు బాగోలేదని, ఎమోషనల్‌ సీన్స్‌ వర్కౌట్‌ కాలేదంటున్నారు. ఈ చిత్రానికి శంకరే దర్శకత్వం వహించాడా? అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండియన్ 3 ట్రైలర్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉందని, మూడో పార్ట్ కోసం ఎదురుచూస్తున్నామని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ నిర్మించాయి. ఇందులో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌జె సూర్య‌, బాబీ సింహ వంటి స్టార్స్ నటించారు.

Show comments