విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు.. విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పాపులర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను కమల్ హాసన్ త్వరలో హీరోగా పరిచయం చేయనున్నాడు. అయితే అది సినిమా కాదు. ఒక మ్యూజిక్ వీడియో. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మ్యూజిక్ వీడియో ఇనిమెల్.. దీన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకు కమల్ హాసన్ కుమార్తె మరియు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సంగీతం అందిస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా తానేంటో నిరూపించుకున్న లోకేష్ కనగరాజ్ ఈ ఇనిమెల్ మ్యూజిక్ వీడియోతో నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మ్యూజిక్ వీడియోలో లోకేష్ కనగరాజ్ హీరోగా నటించనున్నాడు.ఇనిమెల్ మ్యూజిక్ వీడియోను ఆర్‌కేఎఫ్ఐ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే, ఈ మ్యూజిక్ వీడియోను టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతి హాసన్ మ్యూజిక్ అందిస్తుందటమే కాకుండా కాన్సెప్ట్ ను కూడా అందించారు. ఈ వీడియోలో లోకేష్ కనగరాజ్‌తో పాటు శ్రుతి హాసన్ కూడా కనిపించనుంది. అంతేకాకుండా ఇనిమెల్‌కు కమల్ హాసన్ లిరిక్ రైటర్. ఇలా అనేక ప్రత్యేకతలతో ఈ మ్యూజిక్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసుకుంటోంది. ఈ ముగ్గురు స్టార్స్ చేస్తున్న ఇనిమెల్ మ్యూజిక్ వీడియోపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ వీడియో ఎప్పుడెప్పుడూ వస్తుందా అని తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ మ్యూజక్ వీడియో విడుదల తేదిని ప్రకటించనున్నారని సమాచారం. కాగా ఈ మ్యూజిక్ వీడియోకు ద్వారకేష్ ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా చేశారు. అలాగే శ్రీరామ్ అయ్యంగార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు
