Site icon NTV Telugu

Karthik Dandu : చైతూకి కెరీర్ హిట్ ఇస్తా..అక్కినేని ఫ్యాన్స్‌కు డైరెక్టర్ కార్తీక్ ప్రామిస్..

Karthik Dandu Speech Vrushakarma Launch,

Karthik Dandu Speech Vrushakarma Launch,

విరూపాక్ష’తో టాలీవుడ్‌ను వణికించిన దర్శకుడు కార్తీక్ దండు, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి ‘వృషకర్మ’ (Vrushakarma) అనే భారీ మిథికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో కార్తీక్ తన సినీ ప్రయాణం, అక్కినేని కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Also Read : Naga Chaitanya: కార్తీక్ దండుపై ప్రశంసల వర్షం కురిపించిన నాగచైతన్య..

కార్తిక్ మాట్లాడుతూ.. ‘ఏ దర్శకుడికైనా తన హీరోకి కెరీర్ బెస్ట్ సినిమా ఇవ్వాలని ఉంటుంది. నేను అక్కినేని నాగచైతన్యకు తన కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమా ఇస్తున్నాను’ అని కార్తీక్ దండు ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అంతేకాకుండా, ‘నాకు సినిమాపై ఇష్టం పెరగడానికి కారణం కింగ్ నాగార్జున గారే. ఆయనే నా మొదటి హీరో. అలాంటిది ఈరోజు ఆయన అబ్బాయితో సినిమా చేయడం, అది కూడా ఇంత పెద్ద స్థాయిలో చేయడం నా అదృష్టం’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే,

ఈ సినిమా విజువల్స్ మిథికల్ ఎలిమెంట్స్ కోసం చిత్ర బృందం గత రెండేళ్లుగా ఎంతో కష్టపడుతోందని, గ్లింప్స్ అనేది కేవలం శాంపిల్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. సుకుమార్ రైటింగ్స్, SVCC బ్యానర్లపై వస్తున్న ఈ చిత్రం నాగచైతన్యను ముందెన్నడూ చూడని ఒక కొత్త అవతారంలో చూపించబోతోందని కార్తీక్ మాటల ద్వారా అర్థమవుతోంది. దర్శకుడికి హీరోపై ఉన్న ఈ నమ్మకం, అక్కినేని ఫ్యాన్స్‌లో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

Exit mobile version