Site icon NTV Telugu

Atlee : జవాన్ సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు అట్లీ..

Whatsapp Image 2024 03 23 At 11.09.40 Am

Whatsapp Image 2024 03 23 At 11.09.40 Am

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జవాన్’. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీ బ్లాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ సాధించింది..తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూ. 1100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి మరియు ప్రియమణి లాంటి స్టార్ యాక్టర్లు ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ చేశారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

షారుఖ్ ఖాన్ వరుస పరాజయాల తర్వాత 2023లో ‘పఠాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత వచ్చిన ఈ ‘జవాన్’ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే ‘జవాన్‘ మూవీ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ఫ్యాన్స్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. దర్శకుడు అట్లీ కూడా ఈ సినిమా సీక్వెల్ గురించి చాలా సార్లు మాట్లాడారు. తాజాగా దర్శకుడు అట్లీ ఈ మూవీ సీక్వెల్ పై స్పందించారు. ’జవాన్’ సీక్వెల్ గురించి ఇప్పుడే నేను ఏం చెప్పలేను. కానీ, కచ్చితంగా ఓ సర్ ప్రైజ్ తో వస్తాను. సీక్వెల్ కు అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతాయి” అని చెప్పారు. అటు షారుఖ్ ఖాన్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన చెప్పారు. “షారుఖ్ ఖాన్ తో కలిసి పని చేయడం చాలా బాగుంది. ఆయన చాలా జోవియల్ గా ఉంటారు. వర్క్ తో పాటు టైమ్ మెయింటెనెన్స్ చేయడంలో ఆయన ముందుంటారు.మరోసారి ఆయనతో కచ్చితంగా పని చేస్తాను. అయితే అది ఎప్పుదనేది మాత్రం షారుఖ్ చేతిలోనే ఉంది” అని వెల్లడించారు.

Exit mobile version