Site icon NTV Telugu

Ajay Bhupathi : సిద్దార్థ్, అదితి రావ్ రిలేషన్ పై ఆసక్తికర ట్వీట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి..

Whatsapp Image 2023 10 30 At 10.12.28 Am

Whatsapp Image 2023 10 30 At 10.12.28 Am

హీరో సిద్ధార్థ్ మరియు హీరోయిన్ అదితి రావ్ హైదరీ వీరిద్దరూ రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.. తాజాగా దర్శకుడు అజయ్ భూపతి వీళ్ల రిలేషన్‌షిప్ పై చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్, అదితి నటించిన మహా సముద్రం సినిమాను అజయ్ భూపతియే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ సినిమా నుంచే సిద్ధార్థ్, అదితి మధ్య ఏదో నడుస్తోందన్న రూమర్స్ మొదలయ్యాయి. వీళ్లు తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ను బయట పెట్టకపోయినా కానీ తరచూ వీరు ఒకరిని ఒకరు కలుసుకుంటూ తమ మధ్య ఏముందో పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వీళ్ల మధ్య కచ్చితంగా ఏదో ఉందని అభిమానులు ఫిక్సయిన సమయం లో డైరెక్టర్ అజయ్ భూపతి కూడా దీనిపై స్పందించడం గమనార్హం.

సిద్ధార్థ్, అదితి చాలా క్లోజ్ గా ఉన్న ఓ సెల్ఫీని పోస్ట్ చేస్తూ.. “దీనికి కారణం నేనే అని అందరూ అంటారు. నిజంగానే అసలు ఏం జరుగుతోంది?” అంటూ అజయ్ భూపతి సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ జంటను డైరెక్ట్ చేసిన వ్యక్తి కూడా అదే ప్రశ్న అడుగుతుండటంతో ఇక వీళ్ల మధ్య బంధమేంటో అందరికీ బాగా తెలిసిపోయింది.తాజాగా సిద్ధార్థ్.. అదితి బర్త్ డే సందర్బంగా ఆమెను తన పార్ట్‌నర్ అని పిలుస్తూ విషెస్ చెప్పడం విశేషం. ఈ ఫొటో కూడా అప్పుడే తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. విషెస్ ను సిద్ధార్థ్ కాస్త భిన్నంగా చెప్పాడు. దానికి అదితి కూడా రిప్లై ఇచ్చింది. నీలో కవి ఉన్నాడని నాకు తెలియదు.. నువ్వు చాలా టాలెంటెడ్ అని తెలుసుకోవాల్సింది అని అదితి రిప్లై ఇచ్చింది..2021లో వచ్చిన మహా సముద్రం మూవీలో సిద్ధార్థ్, అదితి తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమాను ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా కూడా వీళ్ల ప్రేమకు శ్రీకారం చుట్టింది.

Exit mobile version