NTV Telugu Site icon

Dinesh Karthik: క్రికెట్ కు గుడ్ బై చెప్పి.. జావెలిన్ త్రో చేస్తున్న దినేష్ కార్తీక్..

Dinesh Karthik

Dinesh Karthik

టీ20 ప్రపంచకప్‌లో ఎలైట్ వ్యాఖ్యాత ప్యానెల్లో ఒకరైన దినేష్ కార్తీక్ ఇటీవల ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ 2024 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయాలలో భాగమైన కార్తీక్ ఎలిమినేటర్‌ మ్యాచ్లో ఓటమిని చవిచూసిన టోర్నీ నుండి మాత్రమే కాకుండా తన ఐపీఎల్ క్రికెట్ కు వీడ్కోలు తెలిపాడు. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్ రెండింటికీ వీడ్కోలు చెప్పిన ఈ మాజీ ఆటగాడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. వైరల్ అవుతున్న వీడియోలో దినేష్ కార్తీక్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో కలిసి జావెలిన్ త్రో ప్రదర్శించాడు.

Nothing Phone 2a Special Edition: కలర్ ఫుల్ డిజైన్స్ తో నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ వచ్చేసిందోచ్..

అందులో చోప్రా సలహా మేరకు కార్తిక్ జావెలిన్ ఎలా విసరాలో నేర్చుకున్నాడు. రెండో ప్రయత్నంలో 25 మీటర్ల దూరంలో జావెలిన్‌ విసిరాడు దినేష్. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. అందుకే మీరు క్రికెట్‌ను విడిచిపెట్టారా..? అంటూ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. మరికొందరు.. క్రికెట్ కు గుడ్ బై చెప్పారు కదా ఇక జావెలిన్ త్రో తో మళ్లీ ట్రాక్ పైకి వస్త్ర అంటూ కామెంట్ చేస్తున్నారు.

Viral video: బస్సులో ఉండగా పురిటినొప్పులు.. డ్రైవర్ ఆలోచనతో సుఖంగా ప్రసవం..!

Show comments