Dinesh Karthik Fires on Tamil Nadu Coach: రంజి ట్రోఫీ 2024 సెమీ ఫైనల్‌లో తమిళనాడు జట్టు ముంబై చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అద్భుతమైన బౌలింగ్‌తో తమిళనాడును కట్టడి చేసిన ముంబై.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 146కే ఆలౌట్ అవ్వగా.. ముంబై 353 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ తమిళనాడు బ్యాటర్లు చేతులెత్తేయడంతో 164 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.
సెమీ ఫైనల్ ఓటమిపై తమిళనాడు కోచ్ సులక్షణ్ కులకర్ణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ సాయి కిశోర్ నిర్ణయం వల్లే తమిళనాడు ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. ‘మేం మ్యాచ్‌ను తొలి రోజు ఉదయం 9 గంటలకే కోల్పోయాం. ఒక కోచ్, ముంబై వాసిగా ఇక్కడి పిచ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని మేం సిద్ధమయ్యాం. కానీ కెప్టెన్ సాయి కిశోర్ భిన్నంగా ఆలోచించాడు. టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో తొలి ఇన్నింగ్స్‌లో మేం త్వరగా వికెట్లు కోల్పోయాం. తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యాము’అని కోచ్ కులకర్ణి మ్యాచ్ అనంతరం అన్నాడు.
Also Read: Ellyse Perry Six: ఎల్లీస్ పెర్రీ భారీ సిక్సర్.. కారు అద్దం బద్దలు! వీడియో వైరల్
తమిళనాడు కోచ్ వ్యాఖ్యలపై టీమిండియా వెటరన్ క్రికెటర్, తమిళనాడు బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఫైర్ అయ్యాడు. కెప్టెన్‌కు అండగా నిలవాల్సిన కోచ్.. ఇలా అనడం సరికాదన్నాడు. ‘తమిళనాడు కోచ్ మాటలు అసంతృప్తినిచ్చాయి. అలా మాట్లాడడం సరికాదు. ఏడేళ్ల తర్వాత జట్టును సెమీస్ దాకా తీసుకొచ్చిన కెప్టెన్‌కు కోచ్ అండగా నిలవాలి. అంతేకానీ ఇలా స్వార్థపూరితంగా తప్పందా కెప్టెన్, జట్టు మీద తోసెయ్యకూడదు’ అని డీకే పేర్కొన్నాడు.