NTV Telugu Site icon

Dinesh Karthik: దినేశ్ కార్తిక్‌ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌ 2024 తర్వాత..!

Dinesh Karthik

Dinesh Karthik

Dinesh Karthik Set to Retire After IPL 2024: టీమిండియా సీనియర్ వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు డీకే వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 అతడికి చివరి టోర్నీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దినేశ్‌ కార్తిక్‌ గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో డీకే ఆడాడు. ఆ టోర్నీలో విఫలమవడంతో దినేశ్‌ కార్తిక్‌ జట్టుకు దూరమయ్యాడు.

2008 ఎడిషన్‌ నుంచి దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. 16 సీజన్లలో ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 4516 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 141 క్యాచ్‌లు, 36 స్టంప్‌ ఔట్లు చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు జట్లకు డీకే ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ లయన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకు ఆడాడు. ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Also Read: Shubman Gill Catch: శుభ్‌మ‌న్‌ గిల్ సూపర్ డైవింగ్ క్యాచ్.. వీడియో వైరల్!

మరోవైపు దినేశ్‌ కార్తిక్‌ 2004లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఎంఎస్ ధోనీ వెలుగులోకి రావడంతో డీకే కనుమరుగయిపోయాడు. భారత్ తరఫున 26 టెస్టులు ఆడి 1025 పరుగులు చేశాడు. కీపర్‌గా 57 క్యాచ్‌లు, 6 స్టంపింగ్‌లు చేశాడు. చివరిసారిగా డీకే 2018లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. 94 వన్డే మ్యాచ్‌లు ఆడిన దినేశ్‌ కార్తిక్‌.. 1752 పరుగులు, 64 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక 60 టీ20లలో 686 రన్స్, 30 క్యాచ్‌లు పట్టాడు.