NTV Telugu Site icon

Rohit Sharma-RCB: ఆర్‌సీబీ‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. దినేశ్ కార్తీక్ ఏమన్నాడంటే?

Rohit Sharma India

Rohit Sharma India

Dinesh Karthik About Rohit Sharma RCB Captaincy: ఐపీఎల్ 2025 వేలం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో రోహిత్ ఏ జట్టుకు ఆడతాడనే విషయంపై నిత్యం చర్చ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌ జట్ల నుంచి కెప్టెన్సీ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టులోకి కూడా రోహిత్ వెళుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్‌సీబీ‌ కెప్టెన్‌ హిట్‌మ్యాన్ అని నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఇదే విషయంపై ఆర్‌సీబీ మాజీ ప్లేయర్, మెంటార్ దినేశ్ కార్తీక్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. క్రిక్‌బజ్ ఇంటరాక్షన్‌లో అభిమానులతో డీకే చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని రోహిత్ శర్మ గురించి ప్రశ్నించాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా రోహిత్ ఉంటే ఎలా ఉంటుంది? డీకే అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఆర్చర్యపోయిన డీకే.. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో వేలంలో హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేసే ప్రయత్నం ఆర్‌సీబీ చేస్తుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: MS Dhoni Case: 15 కోట్లు మోసం చేశాడంటూ.. ఎంఎస్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదు!

ఐపీఎల్ 2024 ముందు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అప్పగించింది. ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పించడంతో రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. గతంలో ముంబై జట్టుతో తన ప్రయాణం ముగిసిందని కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ అన్నాడు. ముంబై రిటెన్షన్‌కు హిట్‌మ్యాన్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఐపీఎల్ 2025లో రోహిత్ ఏ జట్టుకు ఆడుతాడో.

Show comments