DK-Deepika: మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా..
- మూడో బిడ్డకు తండ్రైన దినేష్ కార్తీక్..
- చిన్నారికి 'రాహా' అని నామకరణం..
- సోషల్ మీడియాలో రాహా ఫోటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పల్లికల్ దంపతులు తమ ఇంట్లోకి కొత్త అతిథి వచ్చిందని సంతోషంగా ప్రకటించారు. వీరికి ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు ‘రాహా పల్లికల్ కార్తీక్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వీరికి ఇప్పటికే కబీర్, జియాన్ అనే ఇద్దరు కవల కొడుకులు ఉన్నారు. ఇప్పుడు తమ కొడుకులకు తోడుగా చిన్న చెల్లాయి వచ్చిందని వారు మురిసిపోతున్నారు.
దీపికా , దినేష్ కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ‘మా మనసు నిండా దేవుని ఆశీస్సులు, చెప్పలేనంత కృతజ్ఞతతో మా ముద్దుల పాపను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాము. కబీర్, జియాన్ తమ చిన్న చెల్లాయి రాహాను పరిచయం చేస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు’ అని రాశారు.
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
శుభాకాంక్షలు తెలిపిన కోహ్లీ, సానియా మీర్జా
ఈ దంపతులకు క్రీడా లోకం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ పోస్ట్‌పై స్పందిస్తూ హార్ట్ ఎమోజీని పెట్టారు. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా దినేష్ కార్తీక్ దంపతులకు అభినందనలు తెలిపారు.
దినేష్ కార్తీక్ భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సుదీర్ఘ కాలం ఆడారు. సుమారు 20 ఏళ్లకు పైగా టెస్టులు, వన్డేలు, టీ20ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, ఆయన ఇప్పుడు కామెంటేటర్‌గా, కోచ్‌గా రాణిస్తున్నారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు మెంటార్‌గా , బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు.
దీపికా పల్లికల్ భారతదేశపు గొప్ప స్క్వాష్ క్రీడాకారిణి. ప్రపంచ స్క్వాష్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి చేరిన మొదటి భారతీయ మహిళ ఈమె. ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామన్వెల్త్ , ఆసియా క్రీడల్లో ఎన్నో పతకాలు సాధించారు. 2022లో పిల్లల కోసం విరామం తీసుకున్న తర్వాత, ఆమె మళ్లీ క్రీడల్లోకి వచ్చి అద్భుతమైన ఫామ్ చాటుకున్నారు. 2023లో జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఆమె స్వర్ణ పతకం సాధించడం విశేషం.
ప్రస్తుతం ఈ క్రీడా జంట తమ మూడో బిడ్డ రాకతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..