NTV Telugu Site icon

Dil Raju : గేమ్ చేంజర్ విషయంలో కంగారు పడుతున్న దిల్ రాజు..?

Whatsapp Image 2023 09 30 At 10.53.50 Am

Whatsapp Image 2023 09 30 At 10.53.50 Am

గ్లోబల్ స్టార్ రాం చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం ఈపాటికి విడుదల అవ్వాల్సి ఉంది.కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండటం, అలాగే రామ్ చరణ్ ఆ మధ్య షూటింగ్ కు బ్రేక్ తీసుకోవడం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ ఉందని సమాచారం అయితే సినిమా షూటింగ్ ఆలస్యం అయిన కొద్ది నిర్మాతకు భారం పెరుగుతూనే ఉంటుంది. బడ్జెట్‌ విపరీతంగా పెరగడంతో పాటు ఆ బడ్జెట్‌ కి సంబంధించిన వడ్డీలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఏ సినిమా అయినా కూడా ఫైనాన్స్ తీసుకుని మాత్రమే నిర్మిస్తూ ఉంటారు.కనుక గేమ్ ఛేంజర్‌ కోసం తీసుకున్న ఫైనాన్స్ కూడా భారీగా వడ్డీ లు పెరుగుతున్న కారణంగా ఏం చేయాలో అర్ధం కాక దిల్‌ రాజు కాస్త టెన్షన్ పడుతున్నట్లు సమాచారం..

అయితే దర్శకుడు శంకర్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగా గేమ్ చేంజర్ సినిమా ను ముగించాలని ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే వచ్చే ఏడాది సమ్మర్‌ కి అయినా గేమ్‌ ఛేంజర్ వస్తుందా డౌట్ వస్తుంది.. ఇప్పటి వరకు గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ విషయం లో మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎప్పటికి సినిమా షూటింగ్ ని ముగించేది కూడా మేకర్స్ కచ్చితంగా చెప్పట్లేదు.దాంతో దిల్ రాజు కి భారీ మొత్తం లో నష్టాలు తప్పదేమో అన్నట్లుగా కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపుగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌ తో సినిమా రూపొందుతోంది. సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా షూటింగ్ పూర్తి అయి విడుదల అయితే దిల్ రాజు పెట్టిన భారీ మొత్తం వస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి..

Show comments