Site icon NTV Telugu

Digital India: డిజిటల్ యుగంలో ప్రతి భారతీయుడు స్మార్ట్ఫోన్లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్‌లు ఇవే!

Digital India

Digital India

Digital India: ఈ డిజిటల్ కాలంలో రోజువారీ పనులను చాలా సులభతరం చేసే అనేక ప్రభుత్వ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్‌లు వ్యక్తిగత డాక్యుమెంట్‌లను నిర్వహించడంలో సహాయపడటమే కాకుండా.. చెల్లింపులు, ప్రభుత్వ పథకాల సమాచారం, ఫిర్యాదుల పరిష్కారం, మరిన్ని ముఖ్యమైన సేవలకు ప్రత్యక్ష సేవలను అందిస్తాయి. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫారమ్‌లు భారతీయులకు వేగవంతమైన, సురక్షితమైన, నమ్మదగిన డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. మీ ఫోన్‌లో ఈ యాప్‌లు లేకుంటే మీరు అనేక ముఖ్యమైన సౌకర్యాలను కోల్పోయే అవకాశం ఉంది. మరి ఆ ప్రభుత్వ యాప్‌లు ఏంటో చూద్దామా..

BHIM యాప్: సురక్షితమైన, వేగవంతమైన చెల్లింపులు
BHIM యాప్ భారత ప్రభుత్వం సంబంధించిన UPI చెల్లింపు యాప్. ఇది వేగవంతమైన, సులభమైన, సురక్షితమైన డిజిటల్ లావాదేవీల కోసం రూపొందించబడింది. దీని ద్వారా మీరు QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అలాగే నేరుగా బ్యాంకు-టు-బ్యాంకు డబ్బు పంపవచ్చు. అంతేకాదండోయ్.. అవసరమైతే చెల్లింపు అభ్యర్థనను కూడా పంపవచ్చు. దీని ఇంటర్‌ఫేస్ చాలా సరళంగా ఉంటుంది. దీనిని అన్ని వయసుల వారు సులభంగా ఉపయోగించవచ్చు. సురక్షిత లావాదేవీలు, ప్రభుత్వ విశ్వసనీయత కారణంగా కోట్లాది మంది ప్రతిరోజూ ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.

Rohit Sharma: హిట్ మ్యాన్ దెబ్బ.. రికార్డులు అబ్బా.. అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు బద్దలు!

My Gov యాప్: ప్రభుత్వంతో నేరుగా అనుసంధానం
My Gov యాప్ పౌరులను నేరుగా ప్రభుత్వంతో అనుసంధానం చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ యాప్ సహాయంతో ప్రజలు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. అలాగే ఆన్‌లైన్ పోల్స్‌లో పాల్గొనవచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాల తాజా సమాచారాన్ని నేరుగా పొందవచ్చు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలలో పాల్గొనే అవకాశాన్ని ఇది ప్రజలకు అందిస్తుంది.

UMANG యాప్: అన్ని ప్రభుత్వ సేవలకు ఒకే వేదిక
UMANG యాప్ ఒక పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్. ఇక్కడ చాలా ప్రభుత్వ సేవలు మీకు ఒకే చోట లభిస్తాయి. దీని ద్వారా మీరు EPFO, ఆధార్, పాన్, పెన్షన్, స్కాలర్‌షిప్, గ్యాస్ బుకింగ్, నీరు-విద్యుత్ బిల్లులు వంటి వందలాది పనులను చేయవచ్చు. ఈ యాప్ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు అనేక సేవలను అనుసంధానిస్తుంది. దీని వలన ప్రజలు వేర్వేరు వెబ్‌సైట్‌లు లేదా కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో ఉపయోగించడానికి ఇది అత్యంత సులభమైన మార్గం.

Andre Russell-IPL: ఐపీఎల్‌కు ఆండ్రీ రస్సెల్‌ ఆల్విదా.. అయినా కోల్‌కతా జట్టులోనే!

DigiLocker యాప్: డిజిటల్ డాక్యుమెంట్‌ల భద్రత
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన డీజీలాకర్ (DigiLocker) ముఖ్యమైన పత్రాలను డిజిటల్ రూపంలో ఉంచుకునే సదుపాయాన్ని అందిస్తుంది. ఇది ఆధార్‌తో లింక్ చేయబడి, ప్రభుత్వ విభాగాల నుండి నేరుగా ధృవీకరించబడిన పత్రాలను అందిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్, RC, ఆధార్, మెడికల్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్‌లు వంటి పత్రాలు ఫోన్‌లో సురక్షితంగా ఉంటాయి. దీని వలన నేరుగా పత్రాలను తీసుకువెళ్లవలసిన అవసరం తగ్గుతుంది. వినియోగదారులకు ఇందులో అదనంగా 1GB స్టోరేజ్ కూడా లభిస్తుంది.

MADAD యాప్: విదేశాల్లో సహాయం కోసం
MADAD యాప్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా పౌరులకు సహాయం అందించడానికి రూపొందించబడింది. ముఖ్యంగా పత్రాలు పోయినప్పుడు, పాస్‌పోర్ట్ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు లేదా విదేశాలలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ యాప్ సహాయపడుతుంది. ఈ యాప్ వినియోగదారులను నేరుగా సంబంధిత అధికారులతో కలుపుతుంది. దీని వలన ఫిర్యాదులు వేగంగా పరిష్కారమవుతాయి. విదేశీ ప్రయాణం చేసే వారికి లేదా పత్రాల భద్రత గురించి ఆందోళన ఉన్నప్పుడు ఈ యాప్ చాలా సహాయపడుతుంది.

 

Exit mobile version