Dhurandhar: ఆదిత్య ధర్ నటించిన ‘ధురందర్: ది రివెంజ్’ చిత్రం భారతదేశంలో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం ప్రత్యేకంగా పాకిస్థాన్‌లోని ల్యారీలో జరిగే గ్యాంగ్ వార్స్, రాజకీయాలను చూయించింది. ఈ సినిమాను పాకిస్థాన్‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. పైరసీ చేసి మరి అక్కడి జనాలు ఈ సినిమాను వీక్షించారు. అయితే.. ప్రస్తుతం ఈ సినిమాపై పాకిస్థాన్‌లోని ల్యారీ ప్రాంత నివాసులు స్పందించారు. అక్కడి జనాలు వింత వాదనను ముందుకు తెచ్చారు. తమ నగరాభివృద్ధి కోసం సినిమా వసూళ్లలో గణనీయమైన వాటాను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ MORE: Qamar Javed Bajwa: పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా కన్నుమూత
ఓ యూట్యూబ్ ఛానల్, ల్యారీ నుంచి పలు వీడియోలను విడుదల చేసింది. అందులో, సినిమా విజయంపై స్థానిక నివాసితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ వీడియోల్లో ఓ యువకుడు మాట్లాడుతూ.. “ఇది ల్యారీ గురించి తీసిన ఒక భారీ సినిమా. ఈ సినిమా చాలా డబ్బు సంపాదించింది. రూ. 500 కోట్లు మాకు ఇవ్వాలి. ల్యారీ అభివృద్ధి చెందితే, ఇక్కడ మంచి రోడ్లు నిర్మించవచ్చు.” అని పేర్కొన్నాడు. మరొకరు సినిమా వసూళ్లలో కనీసం 70-80% ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను “సోదరా” అని సంభోధించాడు. “మేము చాలా రోజులుగా నగదు డిమాండ్ చేస్తున్నాం, కానీ ల్యారీ ప్రజలకు ఏమీ అందడం లేదు. దయచేసి మాకు ఇవ్వండి, సోదరా.. ” అంటూ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ వింత డిమాండ్‌కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ వీడియోల్లో జనాల డిమాండ్‌ను బట్టి ల్యారీ ఎంత వెనకబాటుకు గురైందో అర్థమవుతోంది. అంతేకాదు.. పాకిస్థాన్‌లోకి కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ సినిమాలో పాకిస్థాన్ పాత్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ల్యారీ ప్రజలు మాత్రం అవేవీ పట్టించుకోకుండా నగర అభివృద్ధి కోసం డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం.
READ MORE: Pooja Hegde: బుట్టబొమ్మ రిటర్న్స్.. ‘జార్జ్ క్రిష్’ కోసం పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్!
ఇక, ధురందర్ చిత్రంలో రణవీర్ సింగ్ హమ్జా అనే భారతీయ గూఢచారి పాత్రను పోషించాడు. అతను అండర్‌వరల్డ్, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించడానికి ల్యారీ ముఠాలలోకి చొరబడతాడు. ఈ చిత్రం ల్యారీలోని ముఠా ఘర్షణలను, రణవీర్ పాత్ర తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆ ముఠాకు ప్రధాన నాయకుడిగా ఎలా ఎదుగుతుందో చూయిస్తుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై-యాక్షన్ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడి మరియు సారా అర్జున్ కూడా నటించారు. మొదటి చిత్రం రూ.1,300 కోట్లు వసూలు చేయగా, రెండవ చిత్రం ఇప్పటివరకు రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేసి, భారతదేశంలోనే రూ.750 కోట్లకు పైగా రాబట్టింది.
"Aditya Dhar ji, attention please…" 🤣🤣
Dhurandhar 2 has earned over ₹1000 crore
so far. Now, people of LYARI are demanding a 50% share for their development. 🤣Pakistan govt is not developing Lyari despite getting billions in loans from US and IMF. pic.twitter.com/gVaHP3R39W
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) March 27, 2026
Aditya Dhar ji, demand has increased. 🤣
Now, people in Lyari are demanding 70–80% share of the profits from Dhurandhar 2.
Pakistan really never miss a chance to demand money on any occasion. Please help them. https://t.co/QaBmx0TF5I pic.twitter.com/LnKnKTTdVI
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) March 28, 2026
