Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ధురందర్: ది రివెంజ్”. ఈ బుధవారం (మార్చి 18) సాయంత్రం నుంచే స్పెషల్ పెయిడ్ ప్రివ్యూల ద్వారా ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా సినిమాలకు గురువారం లేదా శుక్రవారం విడుదల ఉంటుంది. కానీ ‘ధురందర్ 2’ పై ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ బుధవారం నుంచే పెయిడ్ ప్రివ్యూలను ప్లాన్ చేశారు మేకర్స్. కేవలం ప్రివ్యూల ద్వారానే ఈ సినిమా ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హిస్టరీలోనే పెయిడ్ ప్రివ్యూల ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించబోతోంది.
READ ALSO: Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?
సెన్సార్ అప్‌డేట్ & రన్‌టైమ్..
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఇందులో ఉన్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ ఎమోషన్స్ వల్లే ఈ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. సినిమా రన్‌టైమ్ విషయానికొస్తే.. ఇది ఏకంగా 3 గంటల 52 నిమిషాలు ఉండటం విశేషం. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత నిడివి కలిగిన చిత్రాలలో ఒకటిగా ఇది నిలిచింది. భారీ నిడివి ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే ఎక్కడా బోర్ కొట్టకుండా ఆదిత్య ధర్ అద్భుతంగా మలిచారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. శశ్వత్ సచ్‌దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తెలుగు, హిందీ, తమిళం సహా ప్రధాన భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం, 2025లో వచ్చిన మొదటి భాగానికి సీక్వెల్‌గా వస్తోంది. ఈ భారీ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
READ ALSO: Mojtaba Khamenei: అమెరికా – ఇజ్రాయెల్ లొంగిపోతేనే యుద్ధం ఆగిపోతుంది: ఇరాన్ సుప్రీం లీడర్
