NTV Telugu Site icon

Dhoni – Joginder Sharma:12 సంవత్సరాల తర్వాత ధోనిని కలిసిన ప్రపంచ కప్ హీరో..

Dhoni Joginder Sharma

Dhoni Joginder Sharma

Dhoni – Joginder Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జోగీందర్ శర్మ ఎంఎస్ ధోనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై చివరి ఓవర్‌ని బౌల్ చేసి 13 పరుగుల డిఫెండ్‌తో టీమ్ ఇండియా టైటిల్‌ను గెలవడంలో జోగిందర్ శర్మ కీలక పాత్ర పోషించాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ హీరో ఎంఎస్‌ ధోనీతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. MS ధోని 2007 టి20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉండగా., పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో జోగిందర్ శర్మను చివరి ఓవర్‌లో బౌలింగ్ చేయమని పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. దాంతో ధోని నమ్మకాన్ని వృధా చేయకుండా విజయాన్ని అందించాడు. ప్రస్తుతం జోంగిదర్ శర్మ హర్యానా పోలీస్‌ శాఖలో డీఎస్పీ.

Chandigarh : చండీగఢ్ కోర్టులో కాల్పులు.. అల్లుడిని చంపిన పంజాబ్ మాజీ ఏఐజీ

జోగిందర్ శర్మ MS ధోనితో తన సమావేశానికి సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రాలపై ఆయన ‘ఏ యార్ సున్ యారీ తేరీ…’ పాటను ఉపయోగించారు. అంతేకాకుండా., చాలా కాలం తర్వాత MS ధోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. 12 సంవత్సరాల తర్వాత ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చాడు.

BiggBoss OTT 3 Winner: బిగ్ బాస్ విజేతగా హీరోయిన్.. ఏకంగా అన్ని లక్షల ప్రైజ్ మని..

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున హీరోగా మారిన జోగీందర్ శర్మకు అంతర్జాతీయ కెరీర్ చాలా తక్కువ మ్యాచ్ లు మాతరమే ఆడాడు. అతను 2004 నుండి 2007 వరకు టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఈ సమయంలో, కేవలం 4 వన్డేలు, 4 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లో 35 పరుగులు చేశాడు. ఇకమరో వైపు జొంగిదర్ శర్మ అంతర్జాతీయ టీ20లో 4 ఇన్నింగ్స్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. అతను హర్యానా తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడేవాడు. ప్రపంచకప్ హీరో మొత్తం 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. ఈ మ్యాచ్‌ లలో, అతను బౌలింగ్‌లో 297 వికెట్లు తీసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో 5 సెంచరీలు, 10 అర్ధ సెంచరీల సహాయంతో 2804 పరుగులు చేశాడు.