NTV Telugu Site icon

Dharani Committee: సచివాలయంలో మరోసారి ధరణి కమిటీ సమావేశం.. పలు సమస్యలపై చర్చ

Dharani Committee Meeting

Dharani Committee Meeting

Dharani Committee: ధరణి పోర్టల్ పునర్నిర్మాణం, సమస్యల పరిష్కారానికి సిఫార్సులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారిగా ఈనెల 24న జిల్లా కలెక్టర్లతో సమావేశమైన విషయం తెలిసిందే. కాగా.. ఇవాళ సచివాలయంలో వ్యవసాయ, గిరిజన సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్రస్థాయి సిబ్బందితో ధరణి కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలు, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న విధానం, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అందిస్తున్న సేవలు, సాఫ్ట్వేర్ వినియోగం తీరు, ఎదురవుతున్న ఇబ్బందులపై కమిటీ చర్చిస్తుంది.

రైతులకు పెట్టుబడి సాయం (రైతు భరోసా) అందించే క్రమంలో ధరణి సాఫ్ట్ వేర్ ద్వారా నిర్వహణ, భూముల సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఎదురవుతున్న సమస్యలపై చర్చ కొనసాగుతుంది. పోడు భూముల పట్టాల (ఆర్వోఎఫ్ఆర్) జారీ, పోర్టల్ వేదికగా దీనికోసం జారీ చేసే ఫాం ‘కె’, ‘ఎల్’ల నిర్వహణ, షెడ్యూలు ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాల నిర్వ హణ, ఇబ్బందులు, అటవీ, రెవెన్యూ శాఖల భూముల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు, రెవెన్యూ దస్త్రాల్లో నమోదైన అటవీ భూములకు సంబంధించిన అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు.

Read also; Jaya Prakash Narayana: మధ్యయుగ పైశాచికాన్ని ఇవాళ రాజకీయాలలో చొప్పించారు..

రాష్ట్ర సచివాలయంలో తాజాగా.. ఐదు జిల్లాల కలెక్టర్లతో సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు ధరణి పోర్టల్ నిర్వహణ, భూ విచారణకు సంబంధించి తహసీల్దార్ల ఆర్డీఓల పాత్ర, సమస్యల పరిష్కారానికి పోర్టల్‌లోని ఎంపికలు, వాటి పనితీరుపై చర్చించారు. ధరణి సమస్యలపై ఫిర్యాదులు రావడంతో గ్రామీణ, అటవీ-రెవెన్యూ సరిహద్దు, సర్వే తదితర సమస్యలు తలెత్తిన జిల్లాలను దేవాదాయ శాఖ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి తగిన సమాచారంతో హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపారు. మొత్తం 7 అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన భూభారతి సర్వే ప్రాజెక్టు అంశం కూడా చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రతినిధులను రెవెన్యూ శాఖ ఆహ్వానించిన విషయం తెలసిందే..
Emmanuel Macron: హెలికాప్టర్లు, జెట్ ఇంజన్ల నుంచి అంతరిక్షం వరకు… భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందాలివే

Show comments