తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి కేవలం తమిళంలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా.. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.ఇక కెప్టెన్ మిల్లర్ మూవీ రన్‌టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల 37 నిమిషాలు. ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ ను మేకర్స్ నిలిపివేశారు.. తెలుగులో సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో థియేటర్లు దొరకలేదు. దీంతో ప్రస్తుతానికి ఇక్కడ రిలీజ్ నిలిపేయాలని నిర్ణయించారు. తమిళంలో కూడా కెప్టెన్ మిల్లర్ కు పోటీ ఉంది. అక్కడ శివ కార్తికేయన్ నటించిన అయలాన్ మూవీ నుంచి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది.కెప్టెన్ మిల్లర్ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ మరియు సందీప్ కిషన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. సెంథిల్ త్యాగరాజ్ మరియు అర్జున్ త్యాగరాజన్ కెప్టెన్ మిల్లర్ మూవీని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
అయితే కెప్టెన్ మిల్లర్ మూవీ గత ఏడాది డిసెంబర్ 15నే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ఒక నెల ముందే మేకర్స్ అనౌన్స్ చేశారు. పొంగల్ సందర్బంగా రిలీజ్ చేయనున్నట్లు వారు తెలిపారు. 1930ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ సినిమా రూపొందుతోంది.ఈ సినిమా లో ధనుష్ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే వీరుడు కెప్టెన్ మిల్లర్ పాత్ర చేస్తున్నారు.కెప్టెన్ మిల్లర్ మూవీ రెండు భాగాలుగా రానున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై సినీ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ రెండు భాగాలుగా రావడం ఖాయం అయిందని పేర్కొన్నారు. గతంలో వచ్చిన కెప్టెన్ మిల్లర్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. సినిమాపై అంచనాలను పెంచింది
