NTV Telugu Site icon

Dhanush: ధనుష్ ను బ్యాన్ చేయనున్నారా?

Dhanush

Dhanush

తమిళ హీరో ధనుష్ ను త్వరలోనే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ఇటీవల విడుదల అయిన’ సార్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు..ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే తమిళ్ ఇండస్ట్రీ అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ధనుష్‪తోపాటు అతడి చిత్రాలపై నిషేధం గ్యారంటీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అస్సలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ధనుష్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే గతంలో శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇది జరిగి చాలా ఏళ్లవుతుంది. కానీ సినిమా మాత్రం చేయట్లేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ.. తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. ఇలా ఆలస్యం చేస్తున్నందుకుగానూ ధనుష్ కి రెడ్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది..ఇకపోతే ధనుష్ లానే పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు చేయడం లేదనే కారణంతో హీరోలు శింబు, విశాల్, ఎస్జే సూర్య, అథర్వతో పాటు కమెడియన్ యోగిబాబుకి తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇవ్వనుందనే సమాచారం ఈ మధ్యే బయటకొచ్చింది. ఒకవేళ ఇది జారీ చేస్తే.. ఏ దర్శకనిర్మాతలు వీళ్లతో సినిమా చేయడం కుదరదు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లపై నిషేధం విధించినట్లే. గతంలో డైరెక్టర్ శంకర్ తో ఇలాంటి వివాదం కారణంగానే కమెడియన్ వడివేలు వంటి యాక్టర్స్ పై కూడా ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.. ఇప్పుడు మళ్లీ వారంతా సినిమాల్లో బిజీగా ఉన్నారు..

తెలుగులో ‘సార్’తో ఎంట్రీ ఇచ్చి మిక్స్ డ్ టాక్ అందుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు ‘మిల్లర్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇది మూడు భాగాల ఫ్రాంచైజీగా తీస్తున్నారు. తొలి భాగం త్వరలో విడుదల కానుంది. మరోవైపు కొన్నిరోజుల ముందే బాలీవుడ్ లోనూ ఓ చిత్రం ఒప్పుకొన్నాడు. ఒకవేళ రెడ్ కార్డ్ ఇస్తే మాత్రం ఈ సినిమాల రిలీజ్ చెయ్యడం కుదరదు.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో చేస్తున్న సినిమాలకు తీసుకున్న డబ్బులను వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది.. ఏమౌతుందో చూడాలి మరి..
[8:32 am, 02/07/2023] RAKESHREDDY:


[8:33 am, 02/07/2023] Swathi: 😭😭😭😭

Show comments