స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.రీసెంట్ గా హీరో ధనుష్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన ‘సార్’ సినిమా లో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సార్ సినిమా దాదాపు 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ప్రస్తుతం తెలుగు మరియు తమిళ్ లో ధనుష్ వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు.ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయడమే కష్టం అవుతున్న తరుణంలో ధనుష్ ఏకంగా 10 సినిమాలు లైన్లో పెట్టినట్టు సమాచారం.. వచ్చే రెండేళ్లలో ధనుష్ సినిమాలు వరుస గా విడుదల కానున్నాయి…
ప్రస్తుతం ఆయన కమిట్ అయిన సినిమాలు కొన్ని సెట్స్ మీద ఉండగా మరికొన్ని సినిమాలు షూటింగ్ దశ లో ఉన్నాయి.. ఇన్ని సినిమాలు ధనుష్ ఒకేసారి లైన్లో పెట్టడం అంటే మాములు విషయం అయితే కాదు.మిగిలిన హీరోలు ఏడాదికి రెండు సినిమాలు కూడా చేయలేక పోతుంటే ధనుష్ మాత్రం వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. ధనుష్ సినిమాల జోరు చూసి ఇతర హీరోలు కూడా షాక్ అవుతున్నారు.ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్నారు.ప్రస్తుతానికి ”D51” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. అలాగే కింగ్ నాగార్జున కూడా ఈ సినిమా లో ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు.తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి…హీరో ధనుష్ కు ఈ సినిమా తెలుగు లో మరో బ్లాక్ బస్టర్ అందిస్తుందేమో చూడాలి.