NTV Telugu Site icon

Captain Miller : ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డు గెలుచుకున్న.. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం

Sundeep In Captain Miller

Sundeep In Captain Miller

Captain Miller : తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, అదితి బాలన్, సందీప్ కిషన్, ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్, జాన్ కొక్కెన్ సహాయక పాత్రల్లో నటించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మించారు. అలాగే జి.వి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.. సిద్దార్థ నూని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నాగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ధనుష్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేసి ఈ హీరో కెరీర్‌లో హిట్‌ లిస్ట్‌లో చేరింది.

Read Also:Bhanuprakash Reddy: అప్పుల ఊబిలోంచి అభివృద్ధి వైపు ఏపీని తీసుకెళతాం: భానుప్రకాష్ రెడ్డి

తాజాగా ఈ సినిమా లండన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇక ఇదే క్యాటగిరీలో భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్‌’ కూడా నామినేషన్‌ దక్కించుకుంది. పలు హాలీవుడ్‌ చిత్రాలతో ఈ సినిమాలు పోటీ పడనున్నాయి. ప్రస్తుతం ధనుష్‌ ‘రాయన్‌’లో నటిస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ధనుష్‌ 50వ చిత్రం. జులై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జె.సూర్య, కాళిదాస్‌ జయరామ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Read Also:Hyderabad Bonalu: బోనం ఆధ్యాత్మిక సంబురం.. ఆరోగ్య రహస్యం కూడా..