ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశిని ‘ధన త్రయోదశి’ లేదా ‘ధన్‌తేరస్’ అంటారు. దీపావళికి ముందే వచ్చే ధన త్రయోదశి.. సిరి సంపదలకు ప్రత్యేకం. ధన్‌తేరస్ రోజున భారత్‌లో బంగారం కొనడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయకంగా ప్రజలు ధన్‌తేరస్‌లో బంగారం, వెండి సహా ఇతర విలువైన పాత్రలను కొనుగోలు చేస్తారు. ఇది సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. దీపావళి పండగలో భాగంగా ఐదు రోజులు జరుపుకొనే వేడుకల్లో తొలి రోజైన ధన్‌తేరస్.. ఈ ఏడాది అక్టోబర్ 18న వస్తోంది.
భక్తుల కోరికలను తీర్చడానికి అదృష్ట లక్ష్మి తనను పూజించే ప్రతి ఇంటికీ ధన్‌తేరస్ రోజు అతిథిగా విచ్చేస్తుందన్నది ఒక నమ్మకం. ధన్‌తేరస్ రోజున బంగారం కొనుగోలు చేసి మహాలక్ష్మికి సమర్పిస్తే.. సకల అభీష్టాలు నెరవేరతాయని, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో కళకళలాడుతుంటారని భావిస్తారు. ధన్‌తేరస్ నాడు బంగారం, వెండి లేదా ఇతర వస్తువులను కొనాలనుకుంటే.. ఓ శుభ సమయం ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. ఈ ఏడాది బంగారం కొనడానికి శుభ సమయం ఏంటోతెలుసుకుందాం.
Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. వన్డే సిరీస్ నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్!
ధన్‌తేరస్ ముహూర్తం:
ధన్‌తేరస్ త్రయోదశి తిథి ప్రారంభం: అక్టోబర్ 18 మధ్యాహ్నం 12:18 గంటలకు
ధన్‌తేరస్ త్రయోదశి తిథి ముగింపు: అక్టోబర్ 19 మధ్యాహ్నం 01:51 గంటలకు
ధన్‌తేరస్ పూజ ముహూర్తం: రాత్రి 7:16 నుంచి 08:20 వరకు
ధన్‌తేరస్ ప్రదోష కాలం: సాయంత్రం 05:48 నుంచి రాత్రి 08:20 వరకు
బంగారం కొనడానికి శుభ సమయం:
ధన్‌తేరస్ నాడు బంగారం కొనడానికి శుభ సమయం రాత్రి 7:6 నిమిషాలు. మీరు ధన్‌తేరస్ నాడు మధ్యాహ్నం 12:18 నుంచి బంగారం కొనవచ్చు. బంగారం కొనడానికి శుభ సమయం అక్టోబర్ 19 ఉదయం 6:24 వరకు కూడా ఉంటుంది. ధన్ త్రయోదశి తిథి కూడా ధన్‌తేరస్ తర్వాత రోజు (అక్టోబర్ 19) వస్తుంది. కాబట్టి మీరు ఆ రోజు ఉదయం 6:24 నుంచి మధ్యాహ్నం 1:51 గంటల మధ్య బంగారం కొనుగోలు చేయవచ్చు.
