Site icon NTV Telugu

World Champion D gukesh: సూపర్ విక్టరీ.. ప్రపంచ చెస్ నంబర్-1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన గుకేష్

Gukesh

Gukesh

ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ నార్వే చెస్ 2025 ఆరో రౌండ్‌లో సూపర్ విక్టరీ సాధించాడు. తన కెరీర్‌లో తొలిసారిగా క్లాసికల్ టైమ్ కంట్రోల్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సెన్ టోర్నమెంట్ ప్రారంభ రౌండ్‌లో గుకేష్ కు గట్టిపోటీనిచ్చాడు. అయితే, గుకేష్ తిరిగి పుంజుకుని నార్వేజియన్ ఆటగాడిని ఎదురుదాడితో ఓడించి మూడు పాయింట్లు సాధించాడు.

Also Read:CM Revanth Reddy: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఎండ్‌గేమ్‌లో 34 ఏళ్ల నార్వేజియన్ గ్రాండ్‌మాస్టర్ చేసిన అరుదైన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దానిని చిరస్మరణీయ విజయంగా మార్చాడు. ఈ భారత ఆటగాడు 8.5 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకి, అమెరికన్ ఫాబియానో ​​కరువానా కంటే కేవలం ఒక పాయింట్ వెనుకబడి ఉన్నాడు. నార్వే చెస్‌లో రెండోసారి, ఒక భారతీయ టీనేజర్ కార్ల్‌సెన్‌ను క్లాసికల్ ఫార్మాట్‌లో ఓడించాడు. గత సంవత్సరం అది ఆర్ ప్రజ్ఞానందకు సాధ్యమైంది.

Also Read:CM Revanth Reddy: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఓటమి తర్వాత కార్ల్‌సెన్‌ తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. “ఓ మై గాడ్!” అని అరిచాడు, బోర్డుపై తన పిడికిలి బిగించి కొట్టాడు. దీంతో కార్ల్‌సెన్‌ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాగ్నస్ కార్ల్‌సెన్ ఆగ్రహం ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. గుకేష్ కు రెండుసార్లు క్షమాపణలు చెప్పి, అతని వీపు తట్టినప్పటికీ, మాగ్నస్ కార్ల్సెన్ భావోద్వేగ స్పందన నెట్టింట విమర్శలకు దారితీసింది. చాలా మంది అభిమానులు కార్ల్‌సెన్‌ ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి భిన్నంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఓ యూజర్ “నువ్వు అహంకారాన్ని ఇలా జయించావు.. అభినందనలు డి గుకేష్” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Exit mobile version