Site icon NTV Telugu

DGP Shivadhar Reddy: మహిళలు, పిల్లలకు రక్షణగా భరోసా సెంటర్‌లు

Dgp Shivadhar Reddy

Dgp Shivadhar Reddy

DGP Shivadhar Reddy: 2016లో భరోసా సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.. ఈరోజు శంషాబాద్ లో 33వ భరోసా సెంటర్ ప్రారంభం జరిగిందని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.. మహిళలు, పిల్లలపై హింసలు జరిగితే వారికి న్యాయం చేయడానికి భరోసా సెంటర్ లు ఉన్నాయన్నారు.. తాజాగా శంషాబాద్‌లో భారోసా సెంటర్‌ను ప్రారంభించిన డీజీపీ.. ఈ సందర్భంగా ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాలు, 6 కమిషనరేట్ లలో భరోసా సెంటర్ లు ఉన్నాయని తెలిపారు.. భరోసా సెంటర్ ల నిర్వహణ, మానిటరింగ్ మొత్తం విమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు..

Katari Couple Murder Case: చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

“భరోసా సెంటర్ లో ప్రొఫెషినల్ కౌన్సిలర్లు, స్టాఫ్ ఇంటర్.. ఔట్ సోర్సింగ్ విభాగం ఇక్కడ పని చేసే సిబ్బందిని చూసుకుంటారు.. మోసపోయిన మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా సెంటర్లు పని చేస్తాయి.. భరోసా సెంటర్లలో కౌన్సిలింగ్, న్యాయ సహాయం, మెడికల్ సహాయం అందిస్తారు సిబ్బంది.. ఫ్రెండ్లీ వాతావరణంలో భరోసా సెంటర్లు కొనసాగుతాయి.. మర్దర్శక్, సంఘమిత్ర వారు ఇక్కడ పని చేసే వలంటీర్లను ట్రైన్ చేస్తారు. శంషాబాద్ లోని భరోసా సెంటర్ ఏర్పాటుకు బీబీజే గ్రూప్ సహాయం చేశారు.. నూతనంగా ప్రారంభమైన ఈ భరోసా సెంటర్ లో పని చేసే సిబ్బందికి శుభాకాంక్షలు…” అని డీజీపీ శివధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: Online Fruad: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌‌ఫోన్‌ బుక్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా..

Exit mobile version