Site icon NTV Telugu

DGP Jitender: హైదరాబాదులో ఉన్న పాకిస్థానీయులకు డీజీపీ జితేందర్ వార్నింగ్.. నగరాన్ని వదిలి వెళ్లిపోవాలి

Dgp

Dgp

పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై దౌత్య దాడికి పూనుకుంది. సిందూ జలాల ఒప్పందం, వీసాల రద్దు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలర్ట్ చేసింది. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించాలని కేంద్రం ఆదేశించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాదులో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించింది.

Also Read:Realme 14T 5G: 6.67-అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరాలతో రియల్‌మీ 14T 5G భారత్‌లో అధికారికంగా లాంచ్

డీజీపీ జితేందర్ నగరంలో ఉన్న పాకిస్థానీయులకు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాదులో ఉన్న పాకిస్థానీయుల వీసాలు మొత్తం రద్దయ్యాయని తెలిపారు. 27వ తేదీలోగా పాకిస్థానీయులు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు అటారి వాఘ సరిహద్దు బోర్డర్ ఓపెన్ చేసి ఉంటుందని వెల్లడించారు. గడువు ముగిసిన తర్వాత పాకిస్థానీయులు ఎవరున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాదులో ఉన్న పాకిస్తానీల పైన నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాదులో ఎక్కడెక్కడ పాకిస్థానీయులు ఉన్నారో ట్రాకింగ్ చేస్తున్నామని తెలిపారు.

Exit mobile version